|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నితిన్‌ `తమ్ముడు` మూవీ 5 రోజుల కలెక్షన్లు చూస్తే షాకే.. నిర్మాత దిల్‌ రాజు ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాడంటే?

Published: 09-07-2025, 4:50 AM
నితిన్‌ `తమ్ముడు` మూవీ 5 రోజుల కలెక్షన్లు చూస్తే షాకే.. నిర్మాత దిల్‌ రాజు ఎన్ని కోట్లు పోగొట్టుకున్నాడంటే?

నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచే ఫలితాలను సాధించింది. ఐదు రోజుల కలెక్షన్లు చూస్తే షాక్ అవుతారు. నిర్మాత దిల్ రాజు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని సమాచారం.

Key Points

1

నితిన్ 'తమ్ముడు' మూవీ 5 రోజుల్లో కేవలం 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

2

రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ రూ.25 కోట్లు.

4

నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతకు రూ.60 కోట్లు వచ్చినట్లు సమాచారం.

తమ్ముడు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు

నితిన్‌ని వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఐదారు ఫ్లాప్‌లున్నాయి. ఇప్పుడు `తమ్ముడు` సినిమాతో అయినా హిట్‌ కొట్టాలని భావించారు.

కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కూడా నితిన్‌ని బాగా నిరాశ పరిచింది. బాక్సాఫీసు వద్ద ఇది ఏమాత్రం సత్తా చాటలేకపోతుంది.

ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పటించడంలో సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో కలెక్షన్లు చాలా డల్‌గా ఉన్నాయి. మొదటి వీకెండ్‌తో పోల్చితే ఇప్పుడు మరింత ఎక్కువగా పడిపోయాయి.

నితిన్‌ `తమ్ముడు` కలెక్షన్లు చూస్తే ఈ చిత్రం మొదటి రూ.3 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రెండో రోజు సగానికి తగ్గిపోయింది. మూడో రోజు మరింతగా పడిపోయింది. ఇక సోమవారం, మంగళవారం మరింత డల్‌ అయ్యింది.

ఇప్పుడు ఈ మూవీ ఐదు రోజుల్లో కేవలం సుమారు ఆరు కోట్ల గ్రాస్‌ని వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ లెక్కన ఈ మూవీ రూ.3కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ మాత్రమే రాబట్టింది.

నిర్మాత దిల్ రాజు నష్టాలు

`తమ్ముడు` మూవీ రూ.75కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. శ్రీ వెంకటేశ్వరి క్రియేషన్స్ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి సుమారు రూ.25 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. అందులో ఇప్పుడు మూడు కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇంకా రూ.22కోట్లు రాబట్టాల్సి ఉంది. లాంగ్‌ రన్‌లోనూ మహా అయితే ఇంకా కోటి, రెండు కోట్ల వరకు వసూళు చేసే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన ఈ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్లకి ఇరవై కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది.

అయితే `తమ్ముడు` సినిమాకి నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ కూడా బాగానే అయ్యిందట. రూ.20కోట్ల ఓటీటీ రైట్స్, రూ.15కోట్లు శాటిలైట్‌ రైట్స్, కోటీ మ్యూజికల్‌ రైట్స్ రూపంలో వచ్చినట్టు సమాచారం.

ఈ లెక్కన నిర్మాతకు విడుదలకు ముందే దాదాపు అరవై కోట్లు వచ్చాయి. కానీ డిస్ట్రిబ్యూటర్లే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది. దీన్ని దిల్‌ రాజు ఎలా భర్తీ చేస్తారో చూడాలి.

సినిమా బడ్జెట్ మరియు థియేట్రికల్ బిజినెస్

ఈ సంక్రాంతికి `గేమ్‌ ఛేంజర్‌`తో వంద కోట్ల వరకు నష్టాలను చవిచూసిన ఆయన ఇప్పుడు `తమ్ముడు`తో మరో ఇరవై కోట్లకుపైగానే నష్టపోయే అవకాశం ఉంది.

ఇక వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన `తమ్ముడు` చిత్రంలో నితిన్‌ హీరోగా నటించగా, లయ, సప్తమిగౌడ, స్వసిక ముఖ్య పాత్రలు పోషించారు.

అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసే పోరాటం ప్రధానంగా సాగే ఈ చిత్రం జులై 4న ఆడియెన్స్ ముందుకు వచ్చింది.  గ్రాండ్‌గా రిలీజ్‌ అయ్యింది.

సెంటిమెంట్‌, యాక్షన్‌ సీన్లు బాగున్నా, కథలో దమ్ములేకపోవడంతో, ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోవడంతో సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేదు. దీంతో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది.

చివరగా, ‘తమ్ముడు’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. నాన్ థియేట్రికల్ వసూళ్లు నిర్మాతకు కొంత ఉపశమనం కలిగించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.