|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం! తండ్రి బాటలో నితీశ్ తనయుడు! జేడీయూలో నిశాంత్ కుమార్ ఎంట్రీ!!

Published: 08-03-2026, 5:05 AM
సంచలనం! తండ్రి బాటలో నితీశ్ తనయుడు! జేడీయూలో నిశాంత్ కుమార్ ఎంట్రీ!!
  • నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరిక
  • జేడీయూ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం స్వీకరించిన నిశాంత్ కుమార్
  • రాజ్యసభకు నితీశ్ కుమార్ నామినేషన్ దాఖలు, సీఎం పదవికి రాజీనామా?
  • బీహార్‌లో బీజేపీ సీఎం, నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి అనే ఊహాగానాలు

బిహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నితీశ్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేయడంతో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్

బిహార్ పాలిటిక్స్ రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల నుంచి బిహార్ ముఖ్యమంత్రిగా, జేడీయూ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్తానం కొనసాగించిన నితీశ్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూ తీర్థం పుచ్చుకున్నాడు. ఇవాళ పాట్నాలోని జేడీయూ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను నమ్మి నాపై విశ్వాసం ఉంచిన అందరికీ ధన్యవాదాలు. మీరు నాపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా పనిచేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పారు. గత 20 సంవత్సరాల్లో తన తండ్రి చేసిన పనిపై నేను మాత్రమే కాదు, మొత్తం బీహార్ ప్రజలు, దేశం మొత్తం గర్వపడుతోందన్నారు.

రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన నితీశ్ కుమార్ త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న 50 ఏళ్ల నిశాంత్ కుమార్ ఇప్పుడు అధికారికంగా తన జేడీయూలో చేరిపోయారు. నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండటంతో బిహార్ రాష్ట్రానికి బీజేపీ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నిశాంత్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బిహార్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనేది త్వరలోనే తేలనుంది.

రాజ్యసభకు నితీశ్ కుమార్ నామినేషన్

బీహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు?

నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, ఆయన కుమారుడు జేడీయూలో చేరడం బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు. రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.