|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోడీకి అఖిలేష్ షాక్: పెట్రోల్ ధరల పెంపుపై సైకిల్ వ్యూహం!

Published: 15-05-2026, 6:31 AM
మోడీకి అఖిలేష్ షాక్: పెట్రోల్ ధరల పెంపుపై సైకిల్ వ్యూహం!
  • కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 పెంచింది.
  • అఖిలేష్ యాదవ్ సైకిల్ ఫోటోతో మోడీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు.
  • ఇంధనం పొదుపుపై మోడీ వ్యాఖ్యల తర్వాత అఖిలేష్ ట్వీట్ చేయడంతో కౌంటర్‌గా మారింది.
  • ఎన్నికల అనంతరం ధరల పెంపుపై బీజేపీకి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచిన నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సైకిల్ గుర్తుతో కూడిన ఫోటోను షేర్ చేస్తూ, ఇంధన పొదుపుపై మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

పెట్రోల్ ధరల పెంపుపై అఖిలేష్ వ్యంగ్యం

పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. పరోక్షంగా సోషల్ మీడియాలో మోడీ ప్రభుత్వంపై అఖిలేష్ విమర్శలు కురిపించారు. అఖిలేష్ ఎక్స్ లో చేసిన పోస్టులో.. స‌మాజ్ వాదీ పార్టీ గుర్తు సైకిల్‌ను తాను నడిపిస్తున్నట్టు ఉన్న ఫోటో కార్టూన్ ఫోటోను షేర్ చేశారు. మీరు ముందుకు సాగాలి అంటే సైకిల్ ఒకటే మార్గం అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.

మోడీ ఇంధనం వాడకం తగ్గించాలి, పొదుపు చేయాలి అని చేసిన వ్యాఖ్యల తరవాత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేయడంతో ఆయన మెడీకే కౌంటర్ వేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అఖిలేష్ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ ధరలను లీటర్ రూ.3.14, డీజిల్ లీటర్ ధర రూ.3.11 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తైన వెంటనే మోడీ ఇంధనం గురించి మాట్లాడటం, ధరలు పెంచడంతో బీజేపీ పై తీవ్ర విమర్శలు సైతం వస్తున్నాయి.

మోడీ వ్యాఖ్యలకు అఖిలేష్ కౌంటర్

ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపు

అఖిలేష్ యాదవ్ వ్యంగ్య కౌంటర్, ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపుపై ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.