
📌 Key Points
- నటి నివేథా పేతురాజ్ పెళ్లి ఆగిపోయిందని సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వస్తున్నాయి.
- తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియా ఖాతాల నుండి డిలీట్ చేసింది.
- కాబోయే భర్త రాజ్ హిత్ ఇబ్రాన్‌ను కూడా అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది.
- ఈ వార్తలపై నివేథా పేతురాజ్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
హీరోయిన్ నివేథా పేతురాజ్ పెళ్లి ఆగిపోయిందనే వార్తలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను డిలీట్ చేయడంతో పాటు కాబోయే భర్తను అన్‌ఫాలో చేసింది. ఈ వార్తలపై ఆమె నుండి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
పెళ్లి ఆగిపోయిందా? ఫోటోలు డిలీట్ వెనుక కారణం?
Nivetha Pethuraj టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు 2025వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అలాగే మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకుని 2026వ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న నటి రష్మిక మందన్న కూడా 2026 లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈమెతో పాటు మరో నటి నివేథా పేతురాజ్(Nivetha Pethuraj) కూడా గత కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె పెళ్లి ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలకు అనుగుణంగానే నీవేదా పేతురాజ్ సోషల్ మీడియా వేదికగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలు (Engagment Photos)అన్నింటిని డిలీట్ చేశారు అలాగే ఈమె పెళ్లి చేసుకోబోయే రాజ్ హిత్ ఇబ్రాన్ (rajhith ibran)ను కూడా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి నివేదా పేతురాజ్ నిజంగానే తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారా? లేదా? అనే విషయాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల ప్రముఖ క్రికెటర్ స్మృతి మందాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం మర్చిపోకముందే నటి నివేదా కూడ తన వివాహాన్ని రద్దు చేసుకున్నారని వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
నివేథా పేతురాజ్, రాజ్‌హిత్ ఇబ్రాన్ పరిచయం
నివేదా పేతురాజ్ దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఆగస్టు 2025 చివరలో పరిచయం చేసింది అలాగే అక్టోబర్లో వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక వీరి వివాహం 2026 జనవరిలో జరగబోతుందని వార్తలు వచ్చాయి. మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నివేద ఉన్నఫలంగా తన వివాహాన్ని రద్దు చేసుకోవడంతో ఈ విషయంపై ఎన్నో రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల పట్ల ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో అన్ ఫాలో..
నివేథా పేతురాజ్ కెరీర్.. సక్సెస్ ఫుల్ చిత్రాలు
నివేదా పేతురాజ్ కెరియర్ విషయానికి వస్తే ఈమె తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో పలు సినిమాలలో నటిస్తున్నటిగా సక్సెస్ అందుకున్నారు. నివేదా హీరోయిన్ గా నటించిన మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచే వారెవరురా వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నివేదా పేతురాజ్ ప్రియుడితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అభిమానులు భావించారు. కానీ పెళ్లి రద్దయిందని, సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారని వార్తలు బయటకు రావడంతో అందరూ షాక్ అవ్వుతున్నారు.
నివేథా పేతురాజ్ పెళ్లి రద్దు వార్తలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి. అయితే, ఆమె నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఊహాగానాలపై స్పష్టత రాదు. నిజానిజాలు తెలియాలంటే వేచి చూడాలి.


