|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నివేదా థామస్ ట్రెడిషనల్ అందాలు: లావైనా తగ్గని గ్లామర్ అంటూ వైరల్ కామెంట్స్!

Published: 29-12-2025, 8:25 AM
నివేదా థామస్ ట్రెడిషనల్ అందాలు: లావైనా తగ్గని గ్లామర్ అంటూ వైరల్ కామెంట్స్!
  • ‘పెద్ద మనిషి’తో పరిచయం, ‘నిన్ను కోరి’తో గుర్తింపు పొందిన నివేదా థామస్.
  • ‘35 చిన్న కథ కాదు’ మూవీలో లావుగా కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది.
  • ప్రస్తుతం చేతిలో ప్రాజెక్టులు లేక సోషల్ మీడియాకు పరిమితమైంది.
  • ట్రెడిషనల్ పిక్స్‌లో లావైనా తగ్గని గ్లామర్ అంటూ నెటిజన్ల కామెంట్స్ వైరల్.

టాలీవుడ్ నటి నివేదా థామస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం దూసుకుపోతోంది. ఇటీవల సంప్రదాయ దుస్తుల్లో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. లావు పెరిగినా నివేదా అందం, గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ పిక్స్‌పై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

నివేదా థామస్ సినీ ప్రస్థానం

టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘పెద్ద మనిషి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ‘నిన్ను కోరి’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ చిన్నదానికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘జై లవకుశ’, ‘వకీల్ సాబ్’, ‘శాకిని డాకిని’ వంటి సినిమాలతో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ భామ ‘35 చిన్న కథ కాదు’ మూవీలో చాలా లావు అయి కనిపించింది.

అప్పట్లో స్లిమ్‌గా ఉండే ఈ చిన్నది ఒకేసారి లావు అయి కనిపించడంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్‌కు షాక్‌కు గురయ్యారు. అయితే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రజెంట్ ఈ భామ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేనట్టు కనిపిస్తుంది. దీంతో సోషల్ మీడియాకే పరిమితమైంది. అక్కడ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

లావు పెరిగిన నివేదా.. ఫ్యాన్స్ షాక్!

ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా నివేదా తన సోషల్ మీడియాలో కొన్ని ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేసింది. అందులో చీర కట్టుకొని జుట్టు వేసుకుని మల్లెపూలు పెట్టుకొని నగలతో సింగారించుకుని కనిపించింది. కొంచెం సిగ్గుపడుతూ కొన్ని ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు లావైనా కానీ గ్లామర్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెడిషనల్ లుక్‌లో గ్లామర్ డోస్

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

నివేదా థామస్ తన గ్లామర్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదని ఈ తాజా ఫోటోలతో మరోసారి నిరూపించుకుంది. ఆమె భవిష్యత్ ప్రాజెక్టుల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మంచి సినిమాతో మళ్లీ తెరపైకి రావాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.