|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విష్ణుప్రియ : బెట్టింగ్ యాప్స్ కేసుపై విష్ణుప్రియ కామెంట్స్.. అవును నేను తప్పు చేశాను.. మమ్మల్ని కాదు టార్గెట్ చేయాల్సింది..

Published: 25-05-2025, 5:54 AM
విష్ణుప్రియ : బెట్టింగ్ యాప్స్ కేసుపై విష్ణుప్రియ కామెంట్స్.. అవును నేను తప్పు చేశాను.. మమ్మల్ని కాదు టార్గెట్ చేయాల్సింది..

యాంకర్ విష్ణుప్రియ ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇరుక్కుంది. ఈ కేసుపై తాజాగా ఆమె స్పందించింది. తాను తప్పు చేసిందని ఒప్పుకుంటూ, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Key Points

1

విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో పాల్గొన్న విషయం వెల్లడైంది.

2

ఆమె తన తప్పును ఒప్పుకుంటూ, ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించాలని కోరింది.

4

ఈ ఘటన తరువాత ఆమెను ట్రోలింగ్ చేసినట్లు తెలిపింది.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివాదం

Vishnupriya : ఇటీవల యాంకర్ విష్ణుప్రియ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు ఆమెపై కేసు ఫైల్ చేసారు. ఆ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లి వచ్చింది. అప్పట్నుంచి విష్ణు ప్రియ దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి, ఆ కేసు గురించి మాట్లాడింది.

విష్ణు ప్రియ మాట్లాడుతూ.. వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమన్నప్పుడే నేను ఆల్రెడీ ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేసిందేనా అని అడిగాను. వాళ్ళు అవును అన్నారు. నేను నమ్మేసాను. కొన్ని రాష్ట్రాల్లో ఇవి చట్ట విరుద్ధం కాదు అందుకే నేను కూడా చేశాను. అవి ప్రమోట్ చేసి నేను తప్పు చేశాను. కానీ అది నాకు తెలియక చేశాను. నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. ఆ కేసులు, సెక్షన్స్ నాకు తెలీదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు చాలా సేపు కూర్చోపెట్టారు. రిమాండ్ లో పెడతామన్నారు. కానీ లాయర్లు అంతా కేర్ తీసుకొని బయటకు తీసుకొచ్చారు.

విష్ణుప్రియ వివరణ

అప్పుడు బెట్టింగ్ యాప్స్ చట్ట విరుద్ధం అని నాకు తెలియదు. అందుకే చేశాను. ఒకవేళ అవి తప్పైతే గవర్నమెంట్ ఆపాలి. మా దాకా రాకుండా ప్రభుత్వం చూసుకోవాలి. అయినా అందులో మాకు ప్రమోట్ చేసినందుకు కూడా డబ్బులు చాలా తక్కువే ఇచ్చేది. ఆ బెట్టింగ్ యాప్స్ నడిపేవాళ్లు మాత్రం కోట్లు కూడబెట్టుకుంటారు. మమ్మల్ని టార్గెట్ చేయొద్దు. ఆ బెట్టింగ్ యాప్స్ మొదలుపెట్టి నడిపిన వాళ్ళని కదా పట్టుకోవాలి. ప్రమోట్ చేసే వాళ్ళని కాదు, అవి ఆడించేవాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే బెట్టింగ్ ఆడటం వల్ల కష్టాలు అని జనాలకు కూడా అవగాహన ఉండాలి. నేను అంతకుముందు చాలా మంచి ప్రమోషన్స్ చేశాను. అవేమి చూడలేదు. ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాను అని బాగా ట్రోల్ కూడా చేశారు అని తెలిపింది.

ప్రభుత్వంపై డిమాండ్

విష్ణుప్రియ తన తప్పును అంగీకరిస్తూ, ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్‌ను నియంత్రించి, నిజ నిర్వాహకులపై చర్య తీసుకోవాలని కోరింది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.