
📌 Key Points
- బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ పలువురు సెలబ్రిటీల ఆస్తులు జప్తు చేసింది.
- నటుడు సోనూసూద్‌కు చెందిన కోటి రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
- యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప వంటి క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
- మొత్తంగా రూ.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. పలువురు సెలబ్రిటీలతో పాటు ప్రముఖ నటుడు సోనూసూద్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కోటి రూపాయల విలువైన సోనూసూద్ ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో యువరాజ్ సింగ్, ఉర్వశి రౌతేలా వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.
బెట్టింగ్ యాప్స్ కేసు: ఈడీ దర్యాప్తు వేగం
Sonu Sood: ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ గురించి నిత్యం ఏదోక వార్త వినిపిస్తూనే ఉంది.. గత కొన్నినెలల క్రితం బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు.. రోజు రోజుకు ఈ యాప్స్ వల్ల ప్రాణాలను విడిచేవారి సంఖ్య పెరగడంతో పోలీసులు కన్నెర్ర చేశారు. దాంతో పాటుగా పలు కేసులు నమోదు కావడంతో విచారణ చేపట్టారు.. దీన్ని ఎలాగైన సరే కూకటి వేర్లతో నిర్మూలించాలని ఫిక్స్ అయ్యారు.. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడి కూడా రంగ ప్రవేశం చేయడంతో ఈ కేసును మరింత వేగంగా ముందుకు నడిపారు.. ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు సైతం నోటీసులు పంపి వివరణ ఇవ్వాలని కోరారు. అంతటితో ఆగని ఈడీ ఆఫీసర్లు సెలబ్రిటీల ఆస్తులను జప్తు చేసే పనిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తుంది.. ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరెవరు ఆస్తులను కోల్పోయారో ఒకసారి తెలుసుకుందాం..
బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి చాలామంది సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం బాగా ఆస్తులు కూడబెట్టినట్లు గతంలో వార్తలు వినిపించాయి.. వారికి నోటీసులు పంపించిన ఈ డి విచారణకు హాజరుకావాలని కోరారు.. యాప్స్ గురించి వివరణ ఇచ్చిన తర్వాత వారి ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.. అయితే ఈ యాప్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేసిన వారిలో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశిరౌతేలా, సోనూసూద్, మిమీ చక్రవర్తి, అంకుష్హజ్రా, నేహా శర్మలు ఉన్నారు.. వీళ్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేసినట్లు తెలుస్తుంది.
సోనూసూద్‌తో పాటు ఆస్తులు జప్తు అయిన ప్రముఖులు
బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బులను ఈడీ అటాచ్ చేసింది.. అందులో సోనూసూద్ 1 కోటి, యువరాజ్ సింగ్ 2.5 కోట్లు, రాబిన్ ఉతప్ప 8.26 లక్షలు, ఉర్వశిరౌతేలా 2.02 కోట్లు,. మిమీ చక్రవర్తి 59 లక్షలు, అంకుష్హజ్రా 47.20 లక్షలు, నేహా శర్మ 1.26 కోట్లు ఉన్నాయి.. మొత్తం సెలబ్రిటీల దగ్గర నుంచి దాదాపు 20 కోట్ల వరకు ఈడి ఆస్తులను జప్తు చేసినట్లు తెలుస్తుంది.. వీటి వివరాలు గురించి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.. ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ అభిమానుల మన్ననలు అందుకున్న సోనూసూద్ కూడా ఇలాంటి వాటిలో ఇరుక్కోవడంపై ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.. ఇలాంటివి ఇక ముందు చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ లు పెడుతున్నట్లు సమాచారం.
సెలబ్రిటీల ఆస్తుల జప్తు: అభిమానుల స్పందన
ఆన్లైన్ గేమింగ్ యాప్స్ జనాలని ఎంతగా ప్రభావితం చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ యాప్ లను ప్రమోట్ చేయడంతో వారిని గుడ్డిగా నమ్మి జనాలు పెట్టుబడులు పెట్టి దారుణంగా మోసపోయారు. దాంతో ఎంతో మంది ప్రాణాలు పోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బెట్టింగ్ ల ద్వారా వచ్చిన చెల్లింపులు నేరుగా భారత్ లో కాకుండా, అసలు మూలాన్ని దాచిపెట్టడానికి విదేశీ మార్గాలకు మార్చారు.. అలా డబ్బులను దాచుకున్న 6000 అకౌంట్లను గుర్తించి వాటిని అధికారులు సీజ్ చేశారు. అలాగే 60 బ్యాంకు ఖాతాలను కూడా ఈడీ బ్లాక్ చేసింది..
ప్రజలకు సాయం చేసి మంచి పేరు సంపాదించుకున్న సోనూసూద్ ఇలాంటి కేసులో ఇరుక్కోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.


