
📌 Key Points
- బాలకృష్ణ హేమమాలినికి పాదాభివందనం చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
- బాలయ్య సంస్కారానికి కొందరు ఫిదా అవ్వగా, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
- బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాలో నటిస్తున్నారు.
- బాలకృష్ణ నటించిన ‘ఆఖండ 2’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
నందమూరి బాలకృష్ణ సీనియర్ నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హేమమాలినికి పాదాభివందనం చేయడంతో ఈ విషయం వైరల్ అయింది.
హేమమాలినికి పాదాభివందనం చేసిన బాలకృష్ణ
Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇలా ఒకవైపు ఈయన సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయ వ్యవహారాలలో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ(Balakrishna) గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణ ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ(IFFD) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా బాలకృష్ణ సీనియర్ నటి హేమమాలిని(Hema Malini)కి పాదాభివందనాలు చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న బాలయ్య ఇలా మరో నటికి పాదాభివందనాలు చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది. ఈ వీడియో పట్ల నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. బాలయ్య సంస్కారం చూసి అభిమానులు ఫిదా అవ్వగా మరి కొంతమంది మాత్రం మొదటిసారి బాలయ్య ఇలా ఇతరుల కాళ్లు నమస్కరించడం అంటూ కామెంట్ చేస్తున్నారు.
నెటిజన్ల విభిన్న స్పందనలు
సాధారణంగా బాలకృష్ణ ఎవరికీ పాదాభివందనం చేస్తున్న సందర్భాలు ఎక్కడా లేవు అది కూడా హీరోయిన్ల కాళ్లకు నమస్కారం చేసిన సందర్భాలు ఎక్కడ లేదు కానీ మొదటిసారి హేమమాలినికి పాదాభివందనం చేయటంతో బాలయ్య చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలకృష్ణ ఇండస్ట్రీలో అగ్రస్థాయి హీరోగా కొనసాగుతున్నారు మరోవైపు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాలలో కూడా ఉన్నత హోదాలో ఉన్నారు అలాంటి వ్యక్తి తన పరపతి పక్కన పెట్టి పాదాభివందనం చేయడం పట్ల అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే..
బాలకృష్ణ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకూల స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు నిరాశను మాత్రమే మిగిల్చింది. సినిమా తర్వాత బాలకృష్ణ తన 111 వ సినిమాని గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేయబోతున్నారు. ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడిగా మరోసారి నయనతార(Nayanthara) హీరోయిన్ గా కనిపించబోతున్నారు. ఇదివరకే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాలో నటించారు ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
బాలకృష్ణ తదుపరి సినిమా వివరాలు
మొత్తానికి బాలకృష్ణ హేమమాలినికి పాదాభివందనం చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆయన తదుపరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


