
📌 Key Points
- నోరా ఫతేహి ఐటమ్ సాంగ్ ‘సర్సే నిన్న సెరగా సర్సే’ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నెటిజన్లు!
- పాటలోని అసభ్యకర దృశ్యాలు, దుస్తులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం, నిర్మాతలకు నోటీసులు జారీ!
- వివాదం నేపథ్యంలో కేవలం 24 గంటల్లోనే యూట్యూబ్ నుంచి పాటను తొలగించిన KVN ప్రొడక్షన్స్!
- సినిమా ప్రమోషన్ కోసం ఇంత దిగజారాలా అని నెటిజన్ల ఆగ్రహం, సోషల్ మీడియాలో దుమారం!
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె ఒక వివాదంతో తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
నోరా ఫతేహి పాటపై నెటిజన్ల ఆగ్రహం!
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి నిత్యం వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా పలు వివాదాల్లోనూ చిక్కుకుంటూ విమర్శలకు గురవుతోంది. తాజాగా, నోరా ఓ బూతు పాటలో చిందులేయడం సంచలనంగా మారింది. కన్నడ యాక్షన్ డ్రామా ‘కేడీ: ది డెవిల్’ చిత్రం విడుదల కాకముందే భారీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో నోరా ఫతేహి, సంజయ్ దత్ నటించిన ‘సర్సే నిన్న సెరగా సర్సే’ అనే ఐటమ్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ పాటలో నోరా ఫతేహి వేసిన స్టెప్పులు, ధరించిన కాస్ట్యూమ్స్, సాహిత్యం అత్యంత అసభ్యకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. వివాదం ఎంతలా ముదిరిందంటే, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా ఈ విషయంపై జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
తాజాగా, మానవ హక్కుల కమిషన్ సభ్యుడు ప్రియాంక్ కనుంగో ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “కనీస నాగరికత ఉన్న ఏ వ్యక్తయినా ఈ పాటను తన కుటుంబంతో కలిసి చూడగలడా?” అని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ పాటలోని విజువల్స్, సాహిత్యం సభ్యసమాజానికి విరుద్ధంగా ఉన్నాయని భావించిన కమిషన్, చిత్ర నిర్మాతలు కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ కోసం ఇంతలా దిగజారాలా అని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పాట విడుదలైన 24 గంటల లోపే యూట్యూబ్ నుండి దానిని తొలగించి ప్రైవేట్ మోడ్‌లోకి మార్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో అందుబాటులో లేదు.
మానవ హక్కుల కమిషన్ సీరియస్ యాక్షన్!
వెంటనే స్పందించిన చిత్ర యూనిట్!
నోరా ఫతేహి పాట వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


