|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎన్నారై యువతికి టాలీవుడ్ నిర్మాత వేధింపులు! బాగోతం బట్టబయలు!!

Published: 03-04-2026, 8:15 AM
షాకింగ్: కాస్టింగ్ కౌచ్ పేరుతో ఎన్నారై యువతికి టాలీవుడ్ నిర్మాత వేధింపులు! బాగోతం బట్టబయలు!!
  • టాలీవుడ్ నిర్మాత తనను కమిట్‌మెంట్ అడిగినట్లు ఎన్నారై యువతి ఆరోపణ.
  • సహాయ దర్శకుడు రిసార్ట్‌లో నిర్మాతను కలవమని చెప్పడంతో అసలు విషయం తెలిసిందని వెల్లడి.
  • లైంగిక వేధింపుల పరిష్కార కమిటీకి ఫిర్యాదు చేయాలని నటి ఝాన్సీ సూచన.
  • యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టాలీవుడ్‌లో కలకలం.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒక ఎన్నారై యువతి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఒక టాలీవుడ్ నిర్మాత తనను కమిట్మెంట్ అడిగినట్లు ఆమె ఆరోపించింది. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతుంది.

కమిట్‌మెంట్ పేరుతో వేధింపులు: ఎన్నారై యువతి ఆరోపణ

Casting Couch: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ఎంతోమంది మహిళలు ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ఇదే అదునుగా భావించి పలువురు దర్శక నిర్మాతలు మహిళలను కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బందులు గురి చేస్తూ అవకాశాలను ఎరగా వేస్తుంటారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఈ ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్ తనని కమిట్మెంట్ అడిగారు అంటూ ఎన్ఆర్ఐ యువతి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సంచలనంగా మారింది.

న్యూయార్క్‌లో ఉంటున్న ‘పికు నెమలి’ (Piku Nemali) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా సదరు ఎన్నారై మహిళ మాట్లాడుతూ.. తనకు సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉంది ఈ నేపథ్యంలోనే సినిమాలలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను ఇలాంటి సమయంలోనే తనకు తెలిసిన వారి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ నెంబర్ సంపాదించానని, అతనితో మాట్లాడుతూ సినిమాల్లో నటించాలనే తన ఆసక్తిని బయటపెట్టానని ఈమె తెలియజేశారు. ఇలా తన ఆలోచన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కు చెప్పగానే కొద్ది రోజులకు అతని నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు.

రిసార్ట్‌లో కలవమని చెప్పడంతో అసలు విషయం తెలుసుకున్న యువతి

మీరు కమిట్మెంట్ ఇవ్వగలరా అంటూ ప్రశ్నించడంతో తాను పని విషయంలో చాలా కమీటెడ్ గా ఉంటానని సదర యువతి చెప్పినట్లు తెలియజేశారు అయితే వర్క్ గురించి అడుగుతున్నారన్న ఉద్దేశంతోనే తాను ఇలా సమాధానం చెప్పాను కానీ కొద్ది రోజులకు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఫోన్ రావడంతో ఇండియా ఎప్పుడు వస్తున్నారు? టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాత మిమ్మల్ని ఒక రిసార్ట్ లో కలవమన్నారని చెప్పగానే అప్పుడు వాళ్ళ ఉద్దేశం తనకు అర్థం అయిందని దీంతో వెంటనే ఫోన్ కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ చేశానని ఎన్ఆర్ఐ యువతీ తెలిపారు. ఇలా అతని నెంబర్ బ్లాక్ చేసినప్పటికీ వేరే వేరే ఫోన్ నెంబర్స్ నుంచి తనకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఈమె తనకు జరిగినటువంటి ఒక చేదు సంఘటన గురించి బయట పెడుతూ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

?igsh=MTB4MGN3d3V6bjkxbw%3D%3D

స్పందించిన ఝాన్సీ: ఫిర్యాదు చేయాలని సూచన

ఈ వీడియోలో ఈమె ఫోన్ చేసిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? తనని కమిట్మెంట్ అడిగిన నిర్మాత ఎవరు? అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ సభ్యురాలిగా ఉన్న నటి ఝాన్సీ వెంటనే స్పందిస్తూ..ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయాలని కోరుతూ, మహిళా కమిటీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలా బాధితురాలకు ఝాన్సీ అండగా ఉండడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ ఘటన టాలీవుడ్లో మరోసారి కాస్టింగ్ కౌచ్ చర్చకు దారితీసింది. బాధితురాలు ఫిర్యాదు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ఘటనలపై మహిళలు ధైర్యంగా స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.