|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి పల్లవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: MS సుబ్బలక్ష్మి బయోపిక్‌పై బన్నీ వాసు షాకింగ్ క్లారిటీ!

Published: 31-12-2025, 12:00 PM
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్: MS సుబ్బలక్ష్మి బయోపిక్‌పై బన్నీ వాసు షాకింగ్ క్లారిటీ!
  • సాయి పల్లవి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం కన్ఫర్మ్ అయినట్లు నిర్మాత బన్నీ వాసు సూచనప్రాయంగా తెలిపారు.
  • ఈ బయోపిక్ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించబడుతుంది.
  • జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
  • ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు చాలా సానుకూలంగా జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని బన్నీ వాసు వెల్లడించారు.

సాయి పల్లవి, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటిస్తారనే వార్తలకు నిర్మాత బన్నీ వాసు తాజాగా స్పష్టతనిచ్చారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు, సాయి పల్లవిని కన్ఫర్మ్ చేసినట్లు పరోక్షంగా తెలిపారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే అధికారికంగా ప్రకటించబడుతుంది.

సాయి పల్లవి కెరీర్ ప్రస్థానం

Sai Pallavi: ప్రేమమ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన సాయి పల్లవి(Sai Pallavi) మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి మొదటి సినిమాతోనే ప్రేక్షకులందరిని ఫిదా చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా సాయి పల్లవి ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె తెలుగులో చివరిగా నాగచైతన్యతో కలిసి తండెల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తండేల్ మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో సాయి పల్లవి(Sai Pallavi) మరో సినిమాలో నటించబోతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఈమె ప్రముఖ గాయకురాలు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి(M.S.Subbalakshmi) బయోపిక్ సినిమాలో నటించబోతుందని ఈ సినిమాకు జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri)దర్శకత్వం వహించబోతున్నారంటూ ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నిర్మాత బన్నీ వాసు స్పందించారు.

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ వార్తలు

బన్నీ వాసు ప్రస్తుతం ఈషా సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి సాయి పల్లవి నటించబోతున్న సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినిమాలో సాయి పల్లవి నటిస్తున్నారు నిజమేనా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు బన్నీ వాసు సమాధానం చెబుతూ వర్క్ చాలా పాజిటివ్ గా జరుగుతుందని, సాయి పల్లవి కన్ఫర్మ్ అయినట్టేనని ఈయన చెప్పకనే చెప్పేశారు. ఈ బయోపిక్ సినిమా కోసం కథ రెడీ అయ్యిందని తెలియజేశారు.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య..

బన్నీ వాసు ఇచ్చిన క్లారిటీ!

రాక్ లైన్ గారు ఒక పుస్తకం కొన్నారని ఆ పుస్తకం నుంచి అలాగే కొన్ని పబ్లిక్ డొమైన్ నుంచి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఒకతను చాలా అద్భుతంగా కథ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్ చాలా పాజిటివ్ గా జరుగుతుందని త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని ఈయన చెప్పేశారు. ఈ సినిమాతో పాటు నాగచైతన్యతో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు ఈ సందర్భంగా బన్నీ వాసు తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య సినిమా కూడా వర్క్ జరుగుతుందని ఈ రెండు సినిమాలు చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి అంటూ ఈయన సినిమాకు ముందే అప్డేట్స్ తెలియజేస్తూ అంచనాలను పెంచారు. ఇక ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవి సరైన ఎంపిక అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక నాగచైతన్యతో మరో సినిమా కూడా ఉండబోతుందని చెప్పడంతో అక్కినేని అభిమానులకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ బయోపిక్ కోసం కథ సిద్ధంగా ఉందని, సాయి పల్లవి పాత్రకు కన్ఫర్మ్ అయినట్లు బన్నీ వాసు ఇచ్చిన సూచనలతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. త్వరలోనే అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.