|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR : బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో సినిమా.. షారుఖ్ – సల్మాన్ తో కలిసి.. ?

Published: 11-06-2025, 11:50 AM
NTR : బాలీవుడ్ లో ఎన్టీఆర్ మరో సినిమా.. షారుఖ్ – సల్మాన్ తో కలిసి.. ?

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం ‘వార్ 2’ లో నటిస్తున్న ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో కలిసి మరో సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Key Points

1

ఎన్టీఆర్ 'వార్ 2' తో బాలీవుడ్ ఎంట్రీ.

2

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో కలిసి 'పఠాన్ వర్సెస్ టైగర్'లో గెస్ట్ రోల్.

4

ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో మరిన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి.

వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ

NTR : ఎన్టీఆర్ RRR తర్వాత అన్ని భారీ పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నారు. దేవర తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ లో డైరెక్ట్ సినిమా వార్ 2 తో రాబోతున్నాడు. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో భాగంగా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. ఆగస్టు 14 ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే ఎన్టీఆర్ కి ఇదే స్పై యూనివర్స్ లో సోలో హీరోగా కూడా సినిమా ఉంటుంది అని గతంలో డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ అన్నారు. అది కాకుండా ఎన్టీఆర్ మరో బాలీవుడ్ సినిమాలో భాగం అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. YRF యూనివర్స్ లో పఠాన్ వర్సెస్ టైగర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. షారుఖ్ – సల్మాన్ తో ఈ సినిమా ఉండనుంది. షారుఖ్ పఠాన్ – సల్మాన్ టైగర్ పాత్రలతో ఈ సినిమా తెరకెక్కించనున్నారు.

పఠాన్ వర్సెస్ టైగర్ లో గెస్ట్ రోల్

అయితే ఈ సినిమాలో వేరే స్పై హీరోలు గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్, జాన్ అబ్రహంతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ పఠాన్ వర్సెస్ టైగర్ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. దీంతో ఎన్టీఆర్ షారుఖ్ – సల్మాన్ లతో కలిసి నటించబోతున్నాడు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా రావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. ఈ సినిమాని కూడా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తాడని సమాచారం.

ఎన్టీఆర్ యొక్క భవిష్యత్తు ప్రాజెక్టులు

మొత్తానికి ఎన్టీఆర్ మెల్లిమెలిగా బాలీవుడ్ లో సెటిల్ అయిపోతాడేమో అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2, త్రివిక్రమ్ తో మైథాలజీ సినిమా, స్పై యూనివర్స్ లో సోలో సినిమాలు ఉన్నాయి.

Also See : Avika Gor : ఆరేళ్ళ ప్రేమ.. బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..

మొత్తంగా, ఎన్టీఆర్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. వరుస సినిమాలతో అతని కెరీర్ మరింత ఎత్తుకు చేరుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.