
బాలీవుడ్ సినిమా ‘వార్ 2’ షూటింగ్ తన భాగం పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశారు.
హృతిక్ రోషన్ తో కలిసి నటించిన ఎన్టీఆర్ తన అనుభవాలను పంచుకున్నారు.
ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ అయింది, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘వార్ 2’ షూటింగ్ పూర్తి
War 2 : ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నాడు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ YRF నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
తాజాగా ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ పూర్తయింది అంటూ స్పెషల్ ట్వీట్ చేసాడు.
ఎన్టీఆర్ ట్వీట్ వైరల్
ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. వార్ 2 షూటింగ్ పూర్తయింది. దీన్నుంచి చాలా తీసుకున్నాను. హృతిక్ సర్ తో సెట్ లో ఉండటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. వార్ 2 జర్నీలో ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. డైరెక్టర్ అయాన్ అద్భుతం. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఒక పెద్ద సర్ ప్రైజ్ ప్యాకేజ్ ని తయారుచేస్తున్నారు. YRF సంస్థకు, సిబ్బందికి ధన్యవాదాలు. ఆగస్టు 14 న మీరు ఈ సినిమాని చూసేదాకా వేచిఉండలేను అని తెలిపారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా ఫ్యాన్స్ వార్ 2 సినిమాని ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.
అభిమానుల ఆసక్తి
ఎన్టీఆర్ యొక్క వార్ 2 షూటింగ్ పూర్తి కావడంతో అభిమానులు సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి ఆయన పంచుకున్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.


