|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ క్రేజ్.. తెలుగులోనూ అదుర్స్.. కానీ వంద కోట్లకు దూరమే.. ఫస్ట్ డే వార్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇవే!

Published: 15-08-2025, 5:13 AM
ఎన్టీఆర్ క్రేజ్.. తెలుగులోనూ అదుర్స్.. కానీ వంద కోట్లకు దూరమే.. ఫస్ట్ డే వార్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఇవే!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన వార్ 2 సినిమా విడుదలైంది. తెలుగులో అద్భుతమైన స్పందన లభించినప్పటికీ, వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవు. ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు ఎంతో ఇప్పుడు చూద్దాం.

Key Points

1

వార్ 2 తెలుగులో అద్భుతమైన కలెక్షన్లను సాధించింది.

2

ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు రూ. 92.50 కోట్లు.

4

కూలీ సినిమా తో పోటీలో వార్ 2 కలెక్షన్లు తగ్గాయి.

వార్ 2 ప్రపంచవ్యాప్త కలెక్షన్లు

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్.. తారక్ కు బాలీవుడ్ లో ఫస్ట్ ఫిల్మ్.. పైగా ఫేమస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనియర్స్ లో చిత్రం.. ఇలా ఎన్నో స్పెషాలిటీస్ మధ్య వార్ 2 థియేటర్లలోకి వచ్చింది. గురువారం (ఆగస్టు 14) ఈ మూవీ విడుదలైంది. కానీ మిక్స్ డ్ టాక్, రజనీకాంత్ కూలీ మేనియాతో వార్ 2 సినిమాకు ఆశించిన స్థాయిలో వరల్డ్ వైడ్ కలెక్షన్లు రాలేదనే చెప్పొచ్చు. మరి ఫస్ట్ డే వార్ 2 ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ యూనివర్స్‌లో తాజా చిత్రం వార్ 2 . దీనికి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ఈ మూవీ రిలీజైంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ రజనీకాంత్ నటించిన కూలీతో పోటీ పడుతోంది. వార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ, కూలీ మేనియా, మిశ్రమ సమీక్షలు దాని వసూళ్లను దెబ్బతీసినట్లు కనిపిస్తోంది.

తెలుగులో వార్ 2 విజయం

సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం వార్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టడంలో ఫెయిలైంది. జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ తో తెలుగులోనూ మూవీ అదరగొట్టింది. కానీ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లు చూస్తే రూ.92.50 కోట్లు ఉండొచ్చని సక్నిల్క్ తెలిపింది. ఇది యశ్ రాజ్ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ హిట్లు పఠాన్ (రూ.104 కోట్లు)ను వార్ 2 అందుకోలేకపోయింది.

వార్ 2 సినిమా ఇండియాలో ఫస్ట్ డే రూ.52.50 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజైంది. తెలుగులో రూ.23.25 కోట్లు, హిందీలో రూ.29 కోట్లు, తమిళంలో రూ.0.25 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ చూసుకుంటే $3 మిలియన్లు (సుమారు రూ.25 కోట్లు) కలెక్షన్లు ఉంటుందని అంచనా. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ ఏమో రూ.60 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ మూవీ ఓపెనింగ్ డే వసూళ్లు రూ.92.50 కోట్లుగా తెలుస్తోంది.

కూలీ సినిమాతో పోటీ

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనియర్స్ లో భాగమైన సల్మాన్ ఖాన్ టైగర్ 3 (రూ.94 కోట్లు), వార్ (రూ.78 కోట్లు) వసూళ్లను వార్ 2 అధిగమించింది. కానీ ఇది భారతీయ సినిమాలో భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాల నుండి ఆశించే రూ.100 కోట్ల ఓపెనింగ్ డే మార్కు కంటే తక్కువగా ఉంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ అతిపెద్ద హిట్ అయిన పఠాన్ 2023లో రూ.104 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది.

మరోవైపు రజనీకాంత్ కూలీ సినిమా తొలి రోజు వసూళ్లు రూ.120 కోట్ల మార్కును దాటి.. రూ.150 కోట్ల దగ్గరకు కూడా చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. వార్ 2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరు భారతీయ గూఢచారులుగా ఒకరితో ఒకరు పోరాడుకుంటారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అశుతోష్ రాణా కీలక పాత్రల్లో నటించారు.

వార్ 2 సినిమా తెలుగులో అంచనాలను అందుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మార్కును అందుకోలేకపోవడం బాధాకరం. కూలీ సినిమా ప్రభావం కూడా కనిపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.