
📌 Key Points
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ ‘డ్రాగన్’ షూటింగ్ మొదలై ఏడాది అయింది.
- ఈ సినిమా షూటింగ్ దాదాపు 40% పూర్తయినట్లు సమాచారం.
- డైరెక్టర్, హీరో మధ్య గొడవలు జరగడం వల్ల షూటింగ్ ఆలస్యమైంది.
- భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ మొదలై ఏడాది పూర్తయింది. అయితే, ఇప్పటివరకు 40% మాత్రమే షూటింగ్ పూర్తయిందని సమాచారం. సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
‘డ్రాగన్’ మూవీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది?
Dragon Movie : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గత ఏడాది బాలీవుడ్ లో వార్ 2 చిత్రంతో అడుగుపెట్టారు.. ఆ మూవీ భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన సరే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. దాంతో సినిమాకు కలెక్షన్లు అంతంత మాత్రమే వచ్చాయి.. ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు.. ఆ మూవీకి డ్రాగన్ అనే పేరును పరిశీలిస్తున్నారు.. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది.. కానీ ఈ మూవీ షూటింగ్ ఏడాది అవుతున్న కూడా పూర్తి అవ్వలేదన్న విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా మొదలైంది. మరి ఇప్పుడు ఏడాది అవుతున్న సరే సినిమా ఎంతవరకు షూటింగ్ నీ పూర్తి చేసుకున్న విషయం తెలియలేదు. మరి ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎంతవరకు పూర్తయింది అన్న విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
షూటింగ్ ఆలస్యం కావడానికి కారణం ఇదేనా?
ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న తెలుగు చిత్రం డ్రాగన్.. ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఇప్పుడు ఈ సినిమాని థియేటర్లలో చూస్తామని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గత ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.. మళ్లీ ఏడాది ఏప్రిల్ వచ్చేసింది. మరి ఈ సినిమా షూటింగ్ ఎంత వరకూ పూర్తయింది? అంటే విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. తాజాగా సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ సినిమా దాదాపు 40 శాతం వరకు షూటింగ్ని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. మిగిలిన 60 శాతం షూటింగు ఇంకా పెండింగ్ ఉందని తెలుస్తుంది. ఆమధ్య డైరెక్టర్ హీరో మధ్య చిన్న గొడవ జరిగిందన్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. ఈమధ్య ఈ సినిమా మెల్లగా సెట్స్ మీదకి వెళ్ళింది. కొన్ని మేజర్ షెడ్యూల్స్ తప్పితే పూర్తి చేయాల్సిన కీలక షెడ్యూల్స్ ఉన్నో ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ముగింపు దరశకు వచ్చిందని అంతా అనుకుంటున్నారు.. మరి ఈ సినిమా మిగిలిన షూటింగ్ పార్ట్ఎప్పుడు పూర్తవుతుందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే..
ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణకు తెర ఎప్పుడు?
యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి. భారీ సెట్లు, వేలమంది జనం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు ఉంటాయి. కానీ ఇంతటి వేగవంతమైన కాలంలో కూడా షూటింగు ఇంత స్లోగా జరగడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు జరుపుతున్నారు. క్వాలిటీ గా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు కానీ మరీ ఇంత స్లోగా సినిమా షూటింగ్ జరిపితే ఇంకొక ఏడాది పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.. వాస్తవానికి 2026 ప్రథమార్ధంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2027లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఎన్టీఆర్ ఈ డ్రాగన్ సినిమాని పూర్తిచేసుకుని దేవర 2 షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది.. మరి ఈ సినిమా ఎప్పుడు పూర్తవ్వాలి? ఆ సినిమా ఎప్పుడు మొదలవ్వాలి అన్నది ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులకు ప్రశ్నార్థకంగా మారింది..
మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ త్వరలోనే మిగిలిన షూటింగ్ పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తారని ఆశిద్దాం. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుందాం.


