|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ విలన్ ఎంట్రీ! సంచలనంగా మారిన అనిల్ కపూర్ పాత్ర!

Published: 16-01-2026, 3:00 AM
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ విలన్ ఎంట్రీ! సంచలనంగా మారిన అనిల్ కపూర్ పాత్ర!
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.
  • ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ నటిస్తున్నట్లు ప్రకటన.
  • హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
  • ఫిబ్రవరిలో జోర్డాన్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీలో అనిల్ కపూర్

NTR -Neel: కేజీఎఫ్ 1,2 చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఇది రూమర్డ్ టైటిల్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ ఈ పేరే ఫైనల్ కావచ్చు అనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇకపోతే ఇప్పటికే భారీ షెడ్యూలు పూర్తవగా.. రేపటినుండి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో తిరిగి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈనెల ఆఖరి కల్లా ఇక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి నెలలో జోర్డాన్ కి వెళ్ళనున్నారు చిత్ర బృందం. అక్కడే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నిజం చేశారు. ఈ మూవీలో తను కీలక పాత్ర పోషిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అభిమానులలో ఉత్సాహాన్ని నింపారు. ముఖ్యంగా ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టా గ్రామ్ వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. డ్రాగన్ పోస్టర్ ను పంచుకున్న అనిల్ కపూర్.. మరో రెండు లైనప్ లు ఉన్నాయని తెలిపారు. మొత్తానికైతే డ్రాగన్ సినిమాలో అనిల్ కపూర్ నటిస్తున్నట్లు తెలియడంతో ఈ సినిమా కోసం ప్రశాంత్ ఏదో మాస్టర్ ప్లాన్ చేశాడు. అందుకే బాలీవుడ్ స్టార్ అయిన అనిల్ కపూర్ ను రంగంలోకి దింపాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. అయితే ఇందులో అనిల్ కపూర్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై క్లారిటీ లేదు.

షూటింగ్ షెడ్యూల్ వివరాలు

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తో అనిల్ కపూర్ నటిస్తున్న రెండవ చిత్రం ఇది కావడం విశేషం. గతంలో వీరిద్దరూ కలిసి వార్ 2 చిత్రంలో నటించారు. అలాగే అనిల్ కపూర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ తర్వాత రెండోసారి దక్షిణాది దర్శకుడి మూవీలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

అనిల్ కపూర్ పాత్రపై అంచనాలు

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ ఇమేజ్ ను అందుకున్న ఈయన ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేసి మరో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దేవర సీక్వెల్ లో కూడా పాల్గొనబోతున్నారు ఎన్టీఆర్. ఏది ఏమైనా వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్, అనిల్ కపూర్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అనిల్ పాత్ర సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.