|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ntr War 2: పాపం ఆస్ట్రేలియా స్థానికులు.. దెబ్బకు వణికిపోయారు

Published: 25-07-2025, 6:13 AM
Ntr War 2: పాపం ఆస్ట్రేలియా స్థానికులు.. దెబ్బకు వణికిపోయారు

ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా ప్రమోషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో ‘వార్ 2’ అని రాసిన దృశ్యం చూసి ఆస్ట్రేలియా ప్రజలు భయపడ్డారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

ఆస్ట్రేలియాలో 'వార్ 2' అని ఆకాశంలో రాసిన సంఘటన

2

ఎన్టీఆర్ 'వార్ 2' సినిమా ప్రమోషన్ అని నెటిజన్ వెల్లడి

4

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన

ఆస్ట్రేలియాలో ఆకాశంలో ‘వార్ 2’

గత కొన్నేళ్లలో చూసుకుంటే పలు దేశాల మధ్య యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా థాయ్ ల్యాండ్, కంబోడియా మధ్య ఓ దేవాలయం విషయమై పెద్ద గొడవే జరుగుతుంది. ఎక్కడికిక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఎవరైనా మీరు నివసించే ప్రదేశంలో ‘వార్’ అని రాస్తే ఎలా ఉంటుంది. గజగజ వణికిపోతారు కదా! ఇప్పుడు ఆస్ట్రేలియాలోనూ అలాంటిదే జరిగింది.

ఇంతకీ ఏంటి విషయం? గురువారం ఉదయం ఆస్ట్రేలియాకు చెందిన ఓ నెటిజన్.. తాను నివసించే మెల్‌బోర్న్‌లో ఆకాశంలో ఎవరో ‘వార్ 2’ అని రాశారని, దీని గురించి ఎవరికైనా తెలుసా? అని ట్వీట్ చేశారు. రిప్లై ఇచ్చిన మరో నెటిజన్.. ‘తమ అభిమాన హీరో ఎన్టీఆర్‌ కొత్త సినిమా ‘వార్ 2’ని ప్రమోట్ చేసేందుకు ఇలా ప్రేమ చూపించాం’ అని చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సదరు నెటిజన్.. ‘సడన్‌గా ఆకాశంలో వార్ అని రాస్తే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి’ అని తన భయాన్ని బయటపెట్టింది.

ఎన్టీఆర్ అభిమానుల ప్రమోషనల్ స్టంట్

పాపం ఆస్ట్రేలియా ప్రజలు. ఎన్టీఆర్ అభిమానులు చేసిన ఈ పని వల్ల తెగ భయపడిపోయారు. ‘వార్ 2’ సినిమా గురించి మనవాళ్లకు తెలుసు. కాబట్టి ఇక్కడా ఇలా రాసినా పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ దేశం కానీ దేశంలో ఇలా అభిమానం చూపించేసరికి అక్కడి ప్రజలు నిజంగా యుద్ధం ఏమోనని తెగ భయపడిపోయారు. చెప్పాలంటే వణికిపోయింటారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భయపడిన ఆస్ట్రేలియా ప్రజలు

‘వార్ 2’ విషయానికొస్తే.. ఎన్టీఆర్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ. యష్ రాజ్ ఫిల్మ్స్ ఫ్రాంచైజీలో తీస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరో కాగా, ఎన్టీఆర్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

చివరగా, ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఈ ఘటన ఆస్ట్రేలియా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ సంఘటన వైరల్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.