|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా సినిమాను కాపీ కొట్టి ‘ఓజీ’ తీశారు.. దుమారం రేపుతున్న డైరెక్టర్ కామెంట్స్!

Published: 22-10-2025, 4:17 AM
నా సినిమాను కాపీ కొట్టి ‘ఓజీ’ తీశారు.. దుమారం రేపుతున్న డైరెక్టర్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో, కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ‘కబ్జా’ సినిమాను కాపీ కొట్టి ‘ఓజీ’ తీశారని ఆయన చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Key Points

1

పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం సాధించింది.

2

కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు, తమ 'కబ్జా' సినిమాను కాపీ చేసి 'ఓజీ'ని తీశారని ఆరోపణలు చేశారు.

4

ఫ్లాప్ అయిన సినిమాతో పోల్చడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్ విజయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘ఓజీ’(OG). సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా వరల్డ్ వైడ్‌గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఇన్నాళ్లుగా ఎదురుచూసిన అభిమానుల ఆకలి తీర్చింది. ఇందులో సీన్స్, మ్యూజిక్ ‘ఓజీ’ మూవీకి హైలెట్‌గా నిలిచాయి. ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు సెలబ్రిటీలను కూడా మెప్పించింది. ఇలాంటి సినిమాను కాపీ చేశారంటూ కన్నడ డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు(R. Chandru) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసి ట్రోల్స్‌కు గురయ్యారు. ‘‘నేను 2023లో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా ‘కబ్జా’ అనే సినిమాను స్ఫూర్తిగా తీసుకుని ‘ఓజీ’ తీశారు. చాలా వరకు సీన్స్ నా మూవీని పోలి ఉంటాయి’’ అని అన్నారు. ప్రస్తుతం చంద్రు కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఫ్లాప్ అయిన సినిమాతో పోల్చడమే కాకుండా.. హిట్ అయిన ‘ఓజీ’ గురించి అలా మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అతని తప్పు తెలుసుకుని పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.

‘ఓజీ’ కాపీ వివాదం: కన్నడ డైరెక్టర్ ఆరోపణలు

దర్శకుడి వ్యాఖ్యలపై అభిమానుల ఆగ్రహం

‘ఓజీ’పై దర్శకుడి వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సినిమా విజయంతో పాటు ఈ వివాదం కూడా ప్రేక్షకులలో ఉత్సుకత రేపుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్షమాపణలు కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.