
పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ సినిమాపై బడ్జెట్ వివాదం చెలరేగింది. నిర్మాత దానయ్యకు నష్టాలు వచ్చాయని, వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై దర్శకుడు సుజీత్ తాజాగా ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.
Key Points
ఓజీ చిత్రం బడ్జెట్ విషయంలో దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య మధ్య వివాదం.
బడ్జెట్ అంచనాలు దాటడంతో దానయ్యకు నష్టాలంటూ వార్తలు.
సుజీత్ తన నిర్మాత మద్దతుపై ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
నాని సినిమా బ్యానర్ మార్పు కూడా రూమర్లకు బలం చేకూర్చింది.
ఓజీ బడ్జెట్ వివాదం: అసలు ఏం జరిగింది?
దర్శకుడు సుజీత్( Sujeeth), నిర్మాత దానయ్య కలిసి తెరకెక్కించిన చిత్రం ఓజీ (OG).. గత నెలలో విడుదలైన ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే . అక్టోబర్ 23 న ఓటీటీలోకి కూడా రానుంది . ఈ సమయంలో దర్శకుడు సుజీత్ ఒక పోస్ట్ చేశారు . ఓజీ బడ్జెట్ విషయంలో దానయ్యతో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆయన ఇలా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది .
దర్శకుడు సుజీత్ చేసిన పోస్ట్ లో ఇలా పేర్కొన్నారు . ‘ ఓజీ మూవీ విషయంలో చాలామంది ఎన్నో విధాలుగా చర్చించుకున్నారు . అయితే , సినిమా మొదలైన సమయం నుంచి పూర్తి అయ్యే వరకు ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు . ఈ విషయాలు చాలామందికి తెలియవు . ఓజీ మూవీ విషయంలో నా నిర్మాత ఇచ్చిన మద్ధతు చాలా గొప్పది . మాటల్లో చెప్పలేను .’ అని ఆయన అన్నారు .
నిర్మాతతో విభేదాలపై సుజీత్ క్లారిటీ
ఓజీ సినిమా నిర్మాణ కోసం దర్శకుడు సుజీత్ చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మొదటి నుంచే వార్తలు వచ్చాయి . మొదట అనుకున్న బడ్జెట్ కూడా దాటేసిందని ఇండస్ట్రీలో చెప్పుకొచ్చారు . అలా వారిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని ప్రచారం అయింది . రూ . 300 కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్నా సరే ఈ మూవీ బడ్జెట్ భారీ స్థాయిలో పెరగడంతో నిర్మాతకు నష్టాలు తప్పలేదని చాలామంది ఆరోపించారు. దీంతో ఓజీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు దానయ్య నిర్మాతగా వ్యవహరించడం లేదనే టాక్ వైరల్ అయింది .
నాని సినిమాతో కొత్త మలుపు
ఓజీ టైమ్ లోనే హీరో నానితో సుజీత్ ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే . ఈ మూవీని కూడా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే రూపొందిస్తున్నట్టు ఆ సమయంలో తెలిపారు. అయితే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో, దానయ్య- సుజీత్‌ల మధ్య వచ్చిన రూమర్స్ కు మరింత బలాన్ని ఇచ్చాయి . అయితే , తాజాగా సుజీత్ చేసిన పోస్ట్ తో ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది .
మొత్తానికి, ‘ఓజీ’ బడ్జెట్, నిర్మాతతో విభేదాల వార్తలపై దర్శకుడు సుజీత్ స్పష్టతనిచ్చారు. నిర్మాత దానయ్య మద్దతును ప్రశంసిస్తూ, అన్ని ఊహాగానాలకు తెరదించారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లైంది.


