|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమ్మాయితో ముసలాయన పెళ్లి-ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రి హత్యకు ప్లాన్‌-ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి కామెడీ థ్రిల్ల‌ర్‌

Published: 13-11-2025, 2:11 AM
అమ్మాయితో ముసలాయన పెళ్లి-ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రి హత్యకు ప్లాన్‌-ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలోకి కామెడీ థ్రిల్ల‌ర్‌

రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్నమైన కామెడీ థ్రిల్లర్ ‘ఏనుగు తొండం ఘటికాచలం’ నేరుగా ఓటీటీలోకి వచ్చింది. ఈరోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, ఇన్సూరెన్స్ కోసం తండ్రి హత్యకు పిల్లలు వేసిన ప్లాన్ చుట్టూ తిరుగుతుంది.

Key Points

1

రవిబాబు దర్శకత్వంలో రూపొందిన కామెడీ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలోకి వచ్చింది.

2

'ఏనుగు తొండం ఘటికాచలం' అనే పేరుతో ఈ సినిమా విడుదలైంది.

4

ఈ చిత్రం నవ్వులు పూయిస్తూ సస్పెన్స్‌ను నింపుతుందని చెప్పవచ్చు.

రవిబాబు కొత్త సినిమా ఓటీటీ వివరాలు

డైరెక్ట్ గా ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్ మూవీ ఒకటి వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. జాబ్ నుంచి రిటైరైన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఓ ముసలాయన. ఇన్సూరెన్స్ డబ్బు కోసం పిల్లలు అతణ్ని చంపాలనుకుంటారు. దీనికి రవిబాబు డైరెక్టర్. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

రవిబాబు.. టాలీవుడ్ లో విలక్షణ నటుడుగానే కాకుడా వైవిధ్యమైన సినిమాలు తీసే డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఓటీటీ కోసం ఓ మూవీ తీశాడు రవిబాబు. ‘ఏనుగు తొండం ఘటికాచలం’ అనే వెరైటీ టైటిల్ తో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇవాళే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది.

‘ఏనుగు తొండం ఘటికాచలం’ కథాంశం

ఏనుగు తొండం ఘటికాచలం ఓటీటీ

కామెడీ, సస్పెన్స్ మిళితమైన థ్రిల్లర్

పెళ్లి తర్వాత కొన్ని రోజులకు ఘటికాలం కనిపించకుండా పోతాడు. నాన్న ఎక్కడా? అని పిల్లలు వెతుకుతారు. చనిపోయిన వ్యక్తికి ఇన్యూరెన్స్ తీసుకోవచ్చా అని ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా వచ్చే కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. మరి చివరకు ఘటికాచలం ఎక్కడున్నాడు? అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

‘ఏనుగు తొండం ఘటికాచలం’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, రవిబాబు మార్కు కామెడీ, సస్పెన్స్‌తో కూడిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.