|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓం శాంతి శాంతి శాంతి: మహిళల హృదయాలను హత్తుకున్న థీమ్ సాంగ్! సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Published: 08-01-2026, 2:00 PM
ఓం శాంతి శాంతి శాంతి: మహిళల హృదయాలను హత్తుకున్న థీమ్ సాంగ్! సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమాలో నటించారు.
  • A R సజీవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సహజమైన హాస్యం, డ్రామాతో కూడిన విలేజ్ కామెడీ.
  • జయ్ కృష్ణ కంపోజ్ చేసిన హృదయాన్ని తాకే థీమ్ సాంగ్ ప్రతి మహిళకు అంకితంగా విడుదలైంది.
  • ఈ వినోదాత్మక చిత్రం జనవరి 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతి’ చిత్రం నుంచి తాజాగా విడుదలైన థీమ్ సాంగ్ అద్భుతమైన స్పందన అందుకుంటోంది. హృదయాన్ని హత్తుకునే ఈ పాట ప్రతి మహిళకు అంకితం. ఈ విలేజ్ కామెడీ జనవరి 23న రిలీజ్ కానుంది.

ఓం శాంతి శాంతి శాంతి: సినిమా విశేషాలు

ట్యాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ తరుణ్ భాస్కర్ తన అద్భుతమైన నటనతో కూడా అలరిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తున్నారు. A R సజీవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం, సహజమైన హాస్యం, ఆకట్టుకునే డ్రామాతో కూడిన వినోదభరితమైన విలేజ్ కామెడీ.

ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్ , నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సింగిల్ సిన్నారి కోన సాంగ్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

హృదయాన్ని తాకిన థీమ్ సాంగ్

ఈ రోజు సెకండ్ సింగిల్ ఓం శాంతి శాంతి శాంతిః థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రతి మహిళకు అంకితంగా నిలిచే ఈ పాటని జయ్ కృష్ణ హార్ట్ టచ్చింగ్ గా కంపోజ్ చేశారు. అభయ్ జోధ్‌పుర్కర్ వోకల్స్ మరింత ఎమోషన్ ని యాడ్ చేశాయి.

రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

భరద్వాజ్ గాలి రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి పదం మనసుని హత్తుకొని సినిమా ఎసెన్స్ ని ప్రజెంట్ చేశాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాట మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తోంది. ఈ చిత్రానికి దీపక్ డీవోపీగా పని చేస్తున్నారు. నంద కిషోర్ ఈమాని డైలాగ్స్ రాస్తున్నారు. ఓం శాంతి శాంతి శాంతిః జనవరి 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మొత్తంగా, ‘ఓం శాంతి శాంతి శాంతి’ థీమ్ సాంగ్ అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలను పెంచుతోంది. జనవరి 23న విడుదల కానున్న ఈ విలేజ్ కామెడీ ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.