|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం! ఆర్మాక్స్ మీడియా టాప్ 10 జాబితాలో ఎవరు గెలిచారు? మీ అభిమాన నటుడు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి!

Published: 22-02-2026, 3:05 AM
సంచలనం! ఆర్మాక్స్ మీడియా టాప్ 10 జాబితాలో ఎవరు గెలిచారు? మీ అభిమాన నటుడు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోండి!
  • ఆర్మాక్స్ మీడియా జనవరి సర్వేలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.
  • విజయ్ దళపతి రెండవ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
  • అల్లు అర్జున్ మూడవ స్థానంలో ఉండగా, షారుక్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నారు.
  • మహేష్ బాబు ఐదవ స్థానంలో, అజిత్ ఆరవ స్థానంలో ఉన్నారు.

ఆర్మాక్స్ మీడియా జనవరి నెలకు సంబంధించిన టాప్ 10 హీరో హీరోయిన్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ మొదటి స్థానంలో నిలవగా, విజయ్ దళపతి రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. మిగతా హీరోల స్థానాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రభాస్ టాప్, విజయ్ దళపతి సెకండ్

Ormax Media: ఒకప్పుడు ప్రాంతీయంగా మాత్రమే హీరోలు తమ సినిమాలను విడుదల చేసేవారు కాబట్టి ప్రాంతీయంగా ఉండే ఆ హీరోల అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనే తారతమ్యాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు సినిమా స్థాయి పెరిగిపోయింది.. సినిమా చూసే ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. ఇక అందులో భాగంగానే అటు ప్రాంతీయంతో సంబంధం లేకుండా భాషతో పట్టింపు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు టాలీవుడ్ మొదలుకొని అటు బాలీవుడ్ వరకు.. అటు హాలీవుడ్ రేంజ్ లో చిత్రాలను, వెబ్ సిరీస్ లను చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

ఎవరైతే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నారో.. వారికే అభిమానులు పట్టం కడుతున్నారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఇక మీ హీరో గొప్ప మా హీరోయిన్ మిన్న అనే తేడా లేకుండా అటు హీరోయిన్స్ విషయంలో ఇటు హీరోల విషయంలో ఆర్మాక్స్ తో పాటు మరికొన్ని మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నెల ఏ సెలబ్రిటీకి ఏ స్థానం లభించింది అనే విషయంపై సర్వే నిర్వహిస్తూ.. ఆ జాబితాను విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే జనవరి నెలకు సంబంధించిన టాప్ 10 హీరో హీరోయిన్ల జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ఆ టాప్ 10 హీరో , హీరోయిన్స్ జాబితా ఇప్పుడు ఒకసారి చూద్దాం.

అల్లు అర్జున్, షారుక్ ఖాన్ స్థానాలు

ఆర్మాక్స్ మీడియా జనవరి 2026 గానూ.. భారతదేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన నటుల జాబితా విషయానికి వస్తే.. ఎప్పటిలాగే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. రెండవ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy)తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించి.. ఇప్పుడు అట్లీ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun) మూడవ స్థానాన్ని దక్కించుకోగా.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shahrukh Khan) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. మరోవైపు ‘వారణాసి’ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఐదవ స్థానాన్ని దక్కించుకోగా.. కోలీవుడ్ స్టార్ అజిత్(Ajith ) ఆరవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు . ఇక ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటూ.. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చి మళ్ళీ వార్తల్లో నిలిచిన రామ్ చరణ్ (Ram Charan) ఏడవ స్థానాన్ని అందుకుంటే.. ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాతో రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్న ఎన్టీఆర్(Jr ntr)ఎనిమిదవ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.. సల్మాన్ ఖాన్ (Salman Khan), అక్షయ్ కుమార్ (Akshay Kumar) మిగిలిన రెండు చివరి స్థానాలను సొంతం చేసుకోవడం గమనార్హం.

అటు హీరోలు తమ పెర్ఫార్మెన్స్ తో టాప్ టెన్ జాబితాలో స్థానం దక్కించుకుంటుంటే.. ఇటు హీరోయిన్స్ కూడా ఎందులోనూ మేము తీసిపోము అంటూ సంచలనం సృష్టిస్తున్నారు. అటు యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూనే ఇటు హారర్ బ్యాక్ డ్రాప్ లో భయపెట్టేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్మాక్స్ విడుదల చేసిన ఈ టాప్ టెన్ హీరోయిన్స్ జాబితా విషయానికి వస్తే.. నిత్యం ఎఫైర్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తూ.. ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకొని ఇప్పుడు ‘మా ఇంటి బంగారం ‘ సినిమాతో హీరోయిన్గా మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి ముందుకు వస్తున్న సమంత (Samantha) ఎప్పటిలాగే మొదటి స్థానాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) రెండవ స్థానాన్ని దక్కించుకోగా..’మన శంకర వరప్రసాద్ గారు ‘ సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నయనతార (Nayanthara) మూడవ స్థానాన్ని అందుకుంది. అటు విజయ్ దళపతి కారణంగా రాజకీయాల్లో కూడా దుమారం రేపిన త్రిష (Trisha) నాల్గవ స్థానాన్ని అందుకోగా.. అటు వరుస సినిమాలతో ఇటు పెళ్లి విషయంలో వార్తల్లో నిలిచిన రష్మిక మందన్న (Rashmika mandanna)ఐదవ స్థానాన్ని దక్కించుకున్నారు . ఇక మిగిలిన స్థానాలలో కాజల్ అగర్వాల్(Kajal Agarwal), దీపికా పదుకొనే (Deepika Padukone), సాయి పల్లవి (Sai Pallavi), శ్రీ లీల(Sreeleela ), తమన్నా భాటియా (Tamannaah Bhatia) మిగిలిన స్థానాలను కైవసం చేసుకున్నారు.

మహేష్ బాబు, అజిత్ ల ర్యాంకులు

Tags Actress Samantha prabhas Share

Tags Actress Samantha prabhas Share

ప్రేక్షకాదరణ పొందిన నటుల జాబితాలో స్థానం సంపాదించడం గొప్ప విషయం. రాబోయే నెలల్లో ఈ జాబితాలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.