|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి నేరుగా క్రైమ్ థ్రిల్లర్- 19 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లే రాక్షసుడు- విలన్‌గా పంచాయత్ హీరో-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published: 03-10-2025, 5:11 AM
ఓటీటీలోకి నేరుగా క్రైమ్ థ్రిల్లర్- 19 మంది అమ్మాయిలను ఎత్తుకెళ్లే రాక్షసుడు- విలన్‌గా పంచాయత్ హీరో-స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పంచాయత్ సిరీస్ హీరో జితేంద్ర కుమార్ తొలిసారిగా విలన్‌గా నటించిన ‘భాగవత్ చాప్టర్ 1 రాక్షస్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి రానుంది. 19 మంది అమ్మాయిల మిస్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అర్షద్ వార్సీ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీ5లో ఈ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.

2

జితేంద్ర కుమార్ విలన్‌గా, అర్షద్ వార్సీ పోలీస్ అధికారిగా నటించారు.

4

ఈ వెబ్ సిరీస్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

పంచాయత్ హీరో జితేంద్ర కుమార్ విలన్‌గా

ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఈ ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలాగే, అప్పటివరకు హీరోలుగా అలరించిన నటులు ఒక్కసారిగా విలన్ అవతారం ఎత్తుతుంటారు.

అలా, తాజాగా మరో హీరో విలన్‌గా అలరించేందుకు రెడీ అయ్యాడు. అతనే జితేంద్ర కుమార్. అమెజాన్ ప్రైమ్‌ లోని పంచాయత్ వెబ్ సిరీస్‌కు ఎంత పెద్ద క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటివరకు నాలుగు సీజన్స్‌తో పంచాయత్ సిరీస్ అదరగొడుతోంది. ఈ సిరీస్‌లో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు జితేంద్ర కుమార్.

అలాంటి జితేంద్ర కుమార్ విలన్‌గా చేసిన ఓటీటీ సిరీస్ భాగవత్ చాప్టర్ 1 రాక్షస్. ఇందులో సమాజంలోని రాక్షసుడిగా జితేంద్ర కుమార్ చేయనున్నాడు. రాక్షసుడు అయిన జితేంద్ర కుమార్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్‌గా బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేశాడు. వీరితోపాటు అయేషా కాదుస్కర్ కీలక పాత్ర పోషించింది.

19 మంది అమ్మాయిల మిస్సింగ్, ఉత్కంఠ భరిత కథనం

ఇటీవల భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లో 19 మంది అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కాపాడేందుకు ఇన్‌స్పెక్టర్ భగవత్ ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో మిస్ అయిన అమ్మాయిలకు జితేంద్ర కుమార్‌కు సంబంధం ఉంటుంది. దాంతో జితేంద్ర కుమార్‌ను అరెస్ట్ చేసి భగవత్ ఇంట్రాగేషన్ చేస్తుంటాడు.

ఈ క్రమంలో జితేంద్ర కుమార్ పలు విధాలుగా ప్రవర్తిస్తుంటాడు. అది చాలా అనుమానాలు రేకెత్తిస్తుంది. కెమిస్ట్రీ టీచర్ అయిన జితేంద్ర కుమార్ తన కేసును తానే కోర్టులో వాదించుకుంటాడు. ఈ సమయంలో డాక్టర్‌, సాక్షులను సైతం జితేంద్ర కుమార్ కన్‌ఫ్యూజన్‌లో పెట్టించేస్తాడు.

టైటిల్ ప్రకారం 19 మంది అమ్మాయిలను ఎత్తుకెల్లిన రాక్షసుడు జితేంద్ర కుమార్ అమాయకుడా లేదా విలనా అనే థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ఓటీటీ సిరీస్ తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. పురాణ కథ ఆధారంగా టైటిల్ పెట్టిన ఈ సిరీస్‌లో సమాజంలో రాక్షసులు ఎలా ఉంటారో చూపించారనిపిస్తోంది.

భాగవత్ చాప్టర్ 1 రాక్షస్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

19 మంది అమ్మాయిలను ఓ రాక్షసుడు ఎత్తుకెళ్లడం, అతని బారి నుంచి భగవత్ అనే పోలీస్ కాపాడటం చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెరకెక్కింది. రొటీన్ ప్లాట్‌లా అనిపించిన సీన్స్ మాత్రం ఎంగేజ్ చేస్తాయని ట్రైలర్‌తో తెలుస్తోంది. ఇకపోతే జీ5 లో భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

అయితే, ఇప్పటికీ భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. కానీ, ఈ దీపావళి సందర్భంగా జీ5లో భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. నేరుగా ఓటీటీలోకి భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ డిజిటల్ ప్రీమియర్ కానుంది.

భాగవత్ చాప్టర్ 1 రాక్షస్ ట్రైలర్ ఇప్పటికే ఉత్కంఠ రేపింది. జితేంద్ర కుమార్ విలన్ పాత్ర, అర్షద్ వార్సీ ఇంటెన్స్ నటన సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ జీ5లో డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.