
ఈ వారాంతంలో మీరు ఏం చూడాలని ప్లాన్ చేస్తున్నారు? చింతించకండి! ఈ వారం అనేక హిట్ సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యాయి. మలయాళం బ్లాక్‌బస్టర్ ‘నరివెట్ట’ నుండి తెలుగు రొమాంటిక్ డ్రామా ‘8 వసంతాలు’ వరకు…
Key Points
సోనీలివ్ లో మలయాళ బ్లాక్ బస్టర్ 'నరివెట్ట'
నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు రొమాంటిక్ డ్రామా '8 వసంతాలు'
జియోహాట్‌స్టార్ లో మలయాళ డ్యాన్స్ మూవీ 'మూన్‌వాక్'
సన్ నెక్స్ట్ లో తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ 'కలియుగమ్'
ఈ వారం ఓటీటీలో వచ్చిన హిట్ సినిమాలు
ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకటి, రెండు కాదు.. ఒక్కో ఓటీటీలోకి ఈ వారం ఒక్కో హిట్ మూవీ అందుబాటులోకి వచ్చింది. మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ నరివెట్ట కూడా ఇందులో ఉంది. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
నరివెట్ట – సోనీలివ్ ఓటీటీ
ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ నరివెట్ట (narivetta) సోనీ లివ్ ఓటీటీలో గురువారం (జులై 10) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
8 వసంతాలు – నెట్‌ఫ్లిక్స్
వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న సినిమాలు
తెలుగు రొమాంటిక్ డ్రామా 8 వసంతాలు మూవీ శుక్రవారం (జులై 11) నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కు రావడం విశేషం. 8 వసంతాలు మూవీని ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేశాడు. ఇందులో మ్యాడ్ మూవీతో పాపులర్ అయిన నటి అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డిలాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ శుద్ధి అయోధ్య (అనంతిక) అనే అమ్మాయి, ఆమె ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఈ నెట్‌ఫ్లిక్స్ లోనే ఆప్ జైసా కోయి అనే మాధవన్ నటించిన సినిమా కూడా ఉంది.
మూన్‌వాక్ – జియోహాట్‌స్టార్
మలయాళం డ్యాన్స్ మూవీ మూన్‌వాక్ కూడా ఈ వారమే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. బ్రేక్ డ్యాన్స్ పై మక్కువతో కేరళలోని ఓ మారుమూల పట్టణానికి చెందిన కొందరు యువకులు సొంతంగా డ్యాన్స్ నేర్చుకుంటారు. ఆ యువకుల ఎమోషనల్ జర్నీని ఈ సినిమా కళ్లకు కడుతుంది.
మీకు నచ్చే సినిమాను ఎంచుకోండి
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కలియుగమ్. ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ నటించిన ఈ డిస్టోపియన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. 2064లో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇదే ఓటీటీలో చెన్నై సిటీ గ్యాంగ్‌స్టర్స్ అనే మరో తమిళ కామెడీ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది.
రామ్ గోపాల్ వర్మ సమర్పించిన బోల్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ శారీ. ఈ సినిమా ఆహా వీడియోలో అందుబాటులో ఉంది. ఏప్రిల్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆరాధ్యదేవి అనే ఓ అమ్మాయి, ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడే ఓ అబ్బాయి చుట్టూ తిరిగే సినిమా ఇది.
మలయాళం కామెడీ డ్రామా సంతోషం ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి రావడం విశేషం.
ఈ వారం వివిధ ఓటీటీల్లో విడుదలైన అనేక హిట్ సినిమాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. మీకు నచ్చిన జానర్, భాష ఆధారంగా సినిమాను ఎంచుకొని, సరదాగా వీకెండ్‌ను ఆస్వాదించండి!


