
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ్రాడ్ పిట్ హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్ ‘ఎఫ్1’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 5203 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమాను ఇప్పుడు మీ ఇంటి నుంచే చూడవచ్చు.
Key Points
బ్రాడ్ పిట్ నటించిన హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్ ‘ఎఫ్1’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 5203 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో రెంట్ లేదా కొనుగోలు ద్వారా చూడవచ్చు.
మాజీ రేసర్ మరియు యువ రేసర్ మధ్య కథనం ఆధారంగా సినిమా నిర్మించబడింది.
ఎఫ్1 మూవీ ఓటీటీ విడుదల
ఓటీటీలోకి హాలీవుడ్ థ్రిల్లర్ దూసుకొచ్చింది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన బ్రాడ్ పిట్ మూవీ ‘ఎఫ్1’ (F1) డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ఈ హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో చూద్దాం.
ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైన ఎఫ్1 మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ రేసింగ్ చిత్రాన్ని మీరు ఇంటి నుంచే చూడవచ్చు. 4K అల్ట్రా హెచ్డీలో అమెజాన్ ప్రైమ్ వీడియో , యాపిల్ టీవీ ఓటీటీలోకి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. అయితే నేరుగా చూసే అవకాశం లేదు. ఈ మూవీని రెంట్ తీసుకోవచ్చు లేదంటే కొనుక్కోవాలి.
అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్స్
ఎఫ్ 1 మూవీని ఓటీటీలో $19.99కు రెంట్ కు తీసుకోవచ్చు లేదా $24.99కు కొనుగోలు చేయవచ్చు. ఎఫ్1 సినిమాను యాపిల్ ఒరిజినల్ ఫిల్మ్స్ తయారు చేసినందున, హోమ్ వీడియోలో విడుదల కావడం అనుమానమే. అయినప్పటికీ, ఇది ఈ ఏడాది చివరలో యాపిల్ టీవీ ప్లస్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
రేసింగ్ థ్రిల్లర్ ఎఫ్1 మూవీకి బాక్సాఫీస్ లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 596 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5203 కోట్లు) వసూలు చేసింది. బ్రాడ్ పిట్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాకు జోసెఫ్ కోసిన్స్ కీ డైరెక్టర్. ఇది మాజీ రేసర్, యంగ్ రేసర్ కు ట్రైయినింగ్ చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.
కథ మరియు నటీనటులు
ఎఫ్1 సినిమా సోనీ హేస్ (బ్రాడ్ పిట్) అనే మాజీ రేసర్ కథను చెబుతుంది. అతను యువ, ధైర్యవంతుడైన రూకీ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్)కు శిక్షణ ఇవ్వడానికి తిరిగి వస్తాడు. ఇద్దరు డ్రైవర్లు తమ సమస్యలను పక్కన పెట్టి గెలవడానికి కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ మూవీలో కెర్రీ కాండన్, జావియర్ బార్డెమ్, టోబియాస్ మెంజీస్ తదితరులు నటించారు.
సోనీ హేస్ (బ్రాడ్ పిట్) 1990లలో ఫార్ములా 1 అత్యంత ఆశాజనకమైన రేసర్. ట్రాక్‌లోని ప్రమాదం దాదాపుగా అతని కెరీర్‌ను ముగించింది. ముప్పై సంవత్సరాల తరువాత అతను రుబెన్ సోనీని జట్టును కాపాడటానికి తిరిగొస్తాడు. రూకీ జోషువా పియర్స్ (డామ్సన్ ఇడ్రిస్)తో పాటు డ్రైవ్ చేస్తాడు. ఈ ఇద్దరు కలిసి టీమ్ ను గెలిపించారా? గతం బ్రాడ్ పిట్ ను వెంటాడిందా? రేసులో ఎదురైన ట్విస్ట్ లు ఏంటీ అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
చివరికి, బ్రాడ్ పిట్ నటనతో కూడిన ఈ రేసింగ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం. మీరు కూడా ఈ సినిమాను ఓటీటీలో వెతికి చూడండి.


