|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే.. వ‌రుస‌గా మూడు రోజుల్లో మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్లు.. ఒక్కో భాష నుంచి ఒక్కోటి.. ఎక్క‌డ చూడొచ్చంటే?

Published: 26-05-2025, 11:25 PM
ఓటీటీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే.. వ‌రుస‌గా మూడు రోజుల్లో మూడు బ్లాక్‌బ‌స్ట‌ర్లు.. ఒక్కో భాష నుంచి ఒక్కోటి.. ఎక్క‌డ చూడొచ్చంటే?

థియేటర్లలో దుమ్మురేపిన మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లోకి రాబోతున్నాయి. నాని ‘హిట్ 3’, మోహన్ లాల్ ‘తుడరుమ్’, సూర్య ‘రెట్రో’ సినిమాలను వరుసగా మూడు రోజుల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూడొచ్చు.

Key Points

1

మే 29న నాని ‘హిట్ 3’ నెట్‌ఫ్లిక్స్‌లో

2

మే 30న మోహన్ లాల్ ‘తుడరుమ్’ జియో హాట్‌స్టార్‌లో

4

మూడు భాషల మూడు బ్లాక్ బస్టర్లు వరుసగా ఓటీటీలో

నాని ‘హిట్ 3’ ఓటీటీ విడుదల

కంటెంట్ బాగుంటే చాలు ఏ లాంగ్వేజ్ సినిమా అయినా.. ఏ హీరో ఫిల్మ్ అయినా ఓటీటీ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. ఇక థియేటర్లలో బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి మూడు సినిమాలే ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్నాయి. వరుసగా మూడు రోజుల్లో ఒక్కో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఓటీటీ లవర్స్ కు పండగే.

ఓటీటీలో బ్లాక్ బస్టర్ జాతర నాని ‘ హిట్ 3 ’ సినిమాతో స్టార్ట్ కాబోతోంది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన ఈ సినిమా మే 29న డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి ఈ సినిమా రాబోతోంది. మరో రెండు రోజుల్లో నాని సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూసే ఛాన్స్ ఉంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ లో అర్జున్ సర్కార్ గా నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టారు.

మోహన్ లాల్ ‘తుడరుమ్’ డిజిటల్ ప్రీమియర్

పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చి అదరగొట్టిన సినిమా ‘ తుడరుమ్ ’. మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ తో జేజేలు కొట్టించుకుంది. కేరళ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించింది. ఓటీటీ లో ఈ మూవీ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఈ సినిమా మే 30న జియో హాట్ స్టార్ ఓటీటీలోకి రాబోతోంది.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘ రెట్రో ’ మూవీ ఓటీటీ సందడిని మరింత పెంచబోతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఊహించిన కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. మే 31 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లోనే రెట్రో కూడా స్ట్రీమ్ కాబోతోంది. యాక్షన్ డ్రామాగా వచ్చిన రెట్రో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

సూర్య ‘రెట్రో’ ఓటీటీలో ఎప్పుడు?

మే 1న అటు హిట్ 3, ఇటు రెట్రో థియేటర్లకు వచ్చాయి. రెండు సినిమాలు కలెక్షన్లలో అదరగొట్టాయి. నాని సినిమా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక సూర్య సినిమా రూ.230 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఏప్రిల్ 25న రిలీజైన తుడరుమ్ అయితే బాక్సాఫీస్ సెన్సేషన్ గా మారింది. ఈ మూవీ కూడా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మలయాళ సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.

చివరగా, ఈ మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీలో విడుదల కావడం వలన, ఇంటి వద్దే సినిమా ఆనందాన్ని పొందే అవకాశం ప్రేక్షకులకు లభించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.