|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ozempic Drug :ఓజెంపిక్ కు బానిసలవుతున్న బాలీవుడ్.. ఓజెంపిక్ ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Published: 09-12-2025, 4:08 AM
Ozempic Drug :ఓజెంపిక్ కు బానిసలవుతున్న బాలీవుడ్.. ఓజెంపిక్ ప్రయోజనాలు ఏంటో తెలుసా?
  • ఓజెంపిక్ డ్రగ్ టైప్ 2 డయాబెటిస్ రోగుల కోసం రూపొందించబడింది.
  • ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు బరువు తగ్గడానికి, ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది.
  • హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సన్నబడటం కోసం ఈ ఇంజక్షన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు.
  • ఓజెంపిక్ ఇంజక్షన్ల అధిక వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి.

బాలీవుడ్ సెలబ్రిటీలు తమ బరువు తగ్గించుకోవడానికి ఓజెంపిక్ డ్రగ్‌ను ఉపయోగిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి టైప్ 2 డయాబెటిస్ కోసం రూపొందించిన ఈ ఇంజక్షన్ బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుంది? దీని ప్రయోజనాలు, సెలబ్రిటీల వినియోగంపై పూర్తి వివరాలు ఇక్కడ.

ఓజెంపిక్ అంటే ఏమిటి?

Ozempic Drug: సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు పెద్ద ఎత్తున వర్కౌట్స్ చేయటమే కాకుండా డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా ఓజెంపిక్ (Ozempic) పేరు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీలు స్లిమ్ అవ్వటం కోసం ఈ ఇంజక్షన్లను ఉపయోగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. గతంలో తమన్నా ఇలా ఇంజక్షన్లు వాడటం వల్లే చాలా సన్నబడ్డారని వార్తలు రావడంతో ఈ వార్తలను ఆమె ఖండించారు తాను ఎలాంటి ఇంజక్షన్లు వాడలేదని క్లారిటీ ఇచ్చారు.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఈ ఓజెంపిక్ ఇంజక్షన్లు వాడి స్లిమ్ అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది ఓజెంపిక్ అంటే ఏంటి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. నిజానికి ఈ ఓజెంపిక్ డ్రగ్ అనేది టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి కోసం రూపొందించినది. ఈ ఇంజక్షన్ రక్తంలోనే చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది తీసుకోవటం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఈ ఇంజక్షన్ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ విడుదలకు దోహదం చేస్తూ జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుంది. తద్వారా ఆకలి అనే భావన ఉండదు దీంతో శరీర బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గడంలో ఓజెంపిక్ పాత్ర

ఓజెంపిక్ ఇంజక్షన్ శరీర బరువు తగ్గించడానికి దోహదపడుతుంది అంటూ డానిష్ శాస్త్రవేత్తలు కనుగొనడంతో ఈ ఇంజక్షన్ ప్రాధాన్యత పెరిగింది. దీంతో పెద్ద ఎత్తున హాలీవుడ్ సెలబ్రిటీలు తమ శరీర బరువును తగ్గించుకొని స్లిమ్ గా కనిపించడం కోసం ఈ ఇంజక్షన్లను విరివిగా ఉపయోగించారు. ఇక ఈ సంస్కృతి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిందని తెలుస్తోంది. ఇలా ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఓజెంపిక్ ఇంజక్షన్ కు బానిసలుగా మారి వీటిని తీసుకుంటూ శరీర బరువు తగ్గుతున్నారు.

ఈ ఇంజక్షన్ తీసుకోవటం వల్ల శరీర బరువు చాలా తొందరగా తగ్గుతారు ముఖ్యంగా సెలబ్రిటీలు ఏదైనా ప్రత్యేక ఈవెంట్లలో పాల్గొనాలనుకునే వారు రెడ్ కార్పెట్ల పై సందడి చేయబోతున్న సెలబ్రిటీలు ఈ ఇంజక్షన్లను వాడి శరీర బరువును నియంత్రణలో ఉంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇంజక్షన్స్ విరివిగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఇలాంటి ఇంజక్షన్లు వాడే వాళ్ళు కేవలం డాక్టర్ల సలహా మేరకు ఉపయోగించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

సెలబ్రిటీలలో ఓజెంపిక్ వినియోగం

ఓజెంపిక్ డ్రగ్ బరువు తగ్గడానికి సహాయపడినప్పటికీ, ఇది మధుమేహ రోగుల కోసం ఉద్దేశించబడింది. సెలబ్రిటీలు విరివిగా వాడుతున్నప్పటికీ, దీని అధిక వినియోగం వల్ల దుష్ప్రభావాలు తప్పవు కాబట్టి జాగ్రత్త అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.