
📌 Key Points
- 2026 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
- సినీ పరిశ్రమ నుంచి పలువురికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు.
- తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి పద్మ అవార్డులు.
- రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ లకు పద్మశ్రీ అవార్డులు రావడం విశేషం.
ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. 2026 సంవత్సరానికి గాను ఈ అవార్డులను తాజాగా విడుదల చేశారు. ఈసారి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డులను అందుకోనున్నారు.
2026 పద్మ అవార్డు గ్రహీతలు వీరే!
Padma Awards 2026: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినీ ప్రముఖులను వివిధ రకాల అవార్డులతో ప్రతి ఏడాది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సత్కరిస్తున్న సంగతి తెలిసిందే ఇలా కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారాలలో పద్మ అవార్డులు ఎంతో కీలకంగా ఉంటాయి. ఈ పద్మ అవార్డులను ప్రతి ఏడాది ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి మాత్రమే కాకుండా వివిధ రంగాలలో అద్భుతమైన సేవలు అందించిన వారికి పద్మ అవార్డులను అందిస్తారు. ఇక 2026 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ జాబితాలో పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ అవార్డులను అందుకోవటం గమనార్హం. ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు ఎవరెవరు ఈ పద్మ అవార్డులను అందుకోబోతున్నారు అనే విషయానికి వస్తే..
*డాక్టర్ రాజేంద్రప్రసాద్ (పద్మశ్రీ)
*కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (పద్మశ్రీ)
తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందికి అవార్డులు?
*దివంగత నటుడు ధర్మేంద్రకు (పద్మ విభూషణ్)
* నటుడు మమ్ముట్టికి (పద్మవిభూషణ్)
* గాయని అల్కా యాజ్ఞిక్ (పద్మ భూషణ్ )
సినీ పరిశ్రమకు సేవ చేసిన వారికి సత్కారం
సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ సెలబ్రిటీలు పద్మ అవార్డులను అందుకోబోతున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది మొత్తంగా 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా 13 మందికి పద్మభూషణ్,5 మందికి పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 131 మందినీ పద్మ అవార్డులు వరించాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా ఇతర రంగాలకు సంబంధించి మొత్తం 11 మంది ఎంపిక కావడం విశేషం.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, మురళి, మోహన్ ఈ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. మురళీమోహన్ గత కొన్ని దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతూ కళామతల్లికి ఎన్నో సేవలు చేశారు. ఇలా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఈయనకు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు వరించింది . ఇక ఈయనతో పాటు రాజేంద్రప్రసాద్ కు కూడా పద్మశ్రీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. వీరితోపాటు మమ్ముట్టి, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా ఈ అవార్డులు రావడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పద్మ అవార్డులో అందుకున్న సెలబ్రిటీలకు అభిమానులు ఇతర సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు.
భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను అందుకున్న సినీ ప్రముఖులకు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం.


