
📌 Key Points
- పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.458కి చేరిక.
- డీజిల్ ధర లీటరుకు రూ.520కి పెరిగింది.
- యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు కొరత ఏర్పడింది.
- చిన్న రైతులు, ప్రజా రవాణా వాహనాలకు రాయితీలు ప్రకటించిన పాక్ ప్రభుత్వం.
పాకిస్తాన్ వాహనదారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.458కి చేరడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
పాకిస్తాన్‌లో చమురు ధరల మోత
పాకిస్తాన్ వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్ దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పాకిస్తాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 42.7% పెరుగుదలతో లీడర్ పెట్రోల్ ధర 458 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో డీజిల్ రేటు 55% పెరిగింది. ఈ లెక్క ప్రకారం లీటర్ డీజిల్ ధర 520 PKR కు చేరుకుంది. తాజాగా పెరిగిన కిందన ధరలు ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తాయి. ఈ మేరకు పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ అధికారిక ప్రకటన చేశారు. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు కొరత నెలకొంది.
యుద్ధం నేపథ్యంలోనే ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఇదే విషయాన్ని మంత్రి అలీ మాలిక్ వెల్లడించారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పయని వెల్లడించారు. దీంతో ధరలు పెంచక తప్పదని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పారు. అయితే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు కొంత ఊరట ఇచ్చేందుకు కొన్ని సబ్సిడీలను కూడా ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. చిన్న రైతులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నట్లు తెలిపింది. వచ్చే మూడు నెలల పాటు ప్రతీ నెల 20 లీటర్ల వరకు కొంతమేర సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధమైంది సర్కార్.
ధరల పెరుగుదలకు కారణం ఇదే
ప్రజలకు పాక్ సర్కార్ ఊరట
పాకిస్తాన్ ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటించినప్పటికీ, పెరిగిన ధరలు సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గితేనే ప్రజలకు ఊరట లభించే అవకాశం ఉంది.


