|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పళ్లిచట్టంబి: టోవినో మాస్ ట్రీట్! చర్చిల కోసం రౌడీ అవతారం – రివ్యూ చూస్తే షాక్!

Published: 17-04-2026, 6:05 AM
పళ్లిచట్టంబి: టోవినో మాస్ ట్రీట్! చర్చిల కోసం రౌడీ అవతారం - రివ్యూ చూస్తే షాక్!
  • టోవినో మాస్ యాక్షన్, కయాదు గ్లామర్ మెరుపులు, చర్చిల రక్షణ కోసం కృష్ణ పిళ్లై పోరాటం!
  • 1957 కేరళలో కమ్యూనిజం vs క్రిస్టియన్ల సంఘర్షణ, పళ్లిచట్టంబి అసలు కథ ఇదే!
  • ఫస్టాఫ్‌లో గందరగోళం, సెకండాఫ్‌లో క్లారిటీ, ట్విస్టులతో నిండిన కథనం!
  • హిందువు చర్చి రక్షకుడిగా, కలరిపయట్టు విన్యాసాలతో టోవినో అదరగొట్టాడు!

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ నటించిన పళ్లిచట్టంబి మూవీ తెలుగులో విడుదలైంది. ఈ సినిమాలో టోవినో మాస్ లుక్, కయాదు గ్లామర్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. చర్చిలను కాపాడే రౌడీగా టోవినో ఎలా నటించాడో రివ్యూలో తెలుసుకుందాం!

కమ్యూనిజం vs క్రిస్టియన్ల పోరు!

Pallichattambi Movie Review In Telugu: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, బ్యూటిపుల్ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ పళ్లిచట్టంబి. డిజో జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇవాళ థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి పళ్లిచట్టంబి రివ్యూలో తెలుసుకుందాం.

Pallichattambi Review In Telugu: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇవాళ (ఏప్రిల్ 17) తెలుగులో టోవినో థామస్ నటించిన పళ్లిచట్టంబి సినిమా విడుదల అయింది.

కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన పళ్లిచట్టంబి మలయాళంలో ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదల అయింది. రెండు రోజుల గ్యాప్‌తో ఇక్కడ తెలుగులో రిలీజ్ అయింది. డైరెక్టర్ డిజో జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి పళ్లిచట్టంబి రివ్యూ లో తెలుసుకుందాం.

పళ్లిచట్టంబిగా టోవినో విశ్వరూపం!

కట్ చేస్తే 1957లో కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రమంతా కమ్యూనిజం వ్యాపించి చర్చిలను కూలగొడుతుంటారు. చర్చివాళ్లు తమ ఉనికి నిలుపుకునేందుకు ఓ రక్షకుడును కాపాలాగా పెట్టాలనుకుంటారు. అందుకు కృష్ణ పిళ్లై (టోవినో థామస్)ని క్రిస్టోఫర్ చట్టంబిగా రంగంలోకి దింపుతారు. అతన్ని పళ్లిచట్టంబి అనే పేరుతో పిలుస్తారు.

ఆ తర్వాత ఏమైంది? కణియార్‌లో సంభవించిన సంఘటనలు ఏంటీ? కమ్యూనిస్టులకు, క్రిస్టియన్లకు గొడవలు ఎందుకు జరుగుతాయి? వాటి వెనుక ఉన్నది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ కోసం నాటకాలు వేసే రెబెక్కా (కయాదు లోహర్) పాత్ర ఏంటీ? కొండ తరయాట్టుమాలలోని రహస్యం ఏంటీ? దానికి నంబియార్‌కు ఉన్న సంబంధం ఏంటీ? ప్రజలను పళ్లిచట్టంబి కాపాడాడా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

భూమి కోసం, మనుగడ, ఉనికి కోసం పోరాటం చేసే కథ ఇది. ఫస్టాఫ్‌లో చాలా వరకు డైలాగ్స్‌తో కథలోకి తీసుకెళ్లారు. అందులో డైరెక్టర్ తన అనుభవాన్ని చాటుకున్నారు. అయితే, కొంతమేర ఆడియెన్స్‌కు గందరగోళంగా సాగుతుంది. ఏది ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాదు.

కథలో ట్విస్టులు, అసలు రహస్యాలు!

అయితే, సెకండాఫ్‌లో మాత్రం ఆ సన్నివేశాలకు సరైన క్లారిటీ వస్తుంది. ఏది ఎందుకు చేశారో అన్నింటికి సమాధానం దొరుకుంది. అందుకే ఫస్టాఫ్‌లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సెకండాఫ్‌పై క్యూరియాసిటీ పెంచారు. ఒక హిందువును చర్చ్ రక్షకుడిగా నియమించడం, కణియార్ ప్రజలకు హీరో కలరిపయట్టు నేర్పించడం వంటి సీన్లతో ఆసక్తిగా సాగుతుంది.

సినిమా టెక్నికల్ వర్క్ చాలా బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో వచ్చే సినిమాటోగ్రఫీ హైలెట్ అవుతుంది. బీజీఎమ్ దానికి తగినట్లుగా మెప్పిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంగీతం బాగుంది. నిర్మాణల విలువలు రిచ్‌గా ఉన్నాయి. డైరెక్టర్ టేకింగ్ చాలా బాగుంది. కానీ, కథనంలో ఇంకాస్తా వేగం పెంచాల్సింది.

టోవినో థామస్ తన నటనతో మరోసారి అదరగొట్టాడు. ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లో మెప్పించాడు. కయాదు లోహర్ బ్యూటిఫుల్‌గా కనిపించడమే కాదు నటన పరంగా మెప్పిస్తుంది. తెలుగు యాక్టర్ శత్రు తన పాత్రలో ఆకట్టుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ తన విలనిజంతో భయపెట్టిస్తాడు.

పళ్లిచట్టంబి మూవీ టోవినో కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పొచ్చు. మాస్ యాక్షన్ సీన్స్, ట్విస్టులతో సినిమా అదరగొడుతోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.