
📌 Key Points
- శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమా సెన్సార్ పూర్తి, విడుదలకు సిద్ధం.
- హిందీ వ్యతిరేక సన్నివేశాలపై అభ్యంతరాలు, తర్వాత U/A సర్టిఫికెట్‌తో క్లియరెన్స్.
- సినిమా రన్ టైమ్ 162 నిమిషాల 43 సెకండ్లు.
- సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది.
శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. అయితే, సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్‌తో సినిమాను క్లియర్ చేసింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
పరాశక్తి సినిమా సెన్సార్ పూర్తి
Parasakthi Censor: సంక్రాంతి పండుగ సందర్భంగా కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా నటించిన పరాశక్తి (Parasakthi)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర(Sudha kongara) దర్శకత్వంలో శివ కార్తికేయన్ శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 10 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ సమస్యలను ఎదుర్కొంది. ఈ సినిమా హిందీ ఉద్యమ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా హిందీ వ్యతిరేకత సన్నివేశాల గురించి సెన్సార్ అభ్యంతరం తెలపడమే కాకుండా ఈ సినిమాలో ఏకంగా 23 కట్స్ విధించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో కొన్ని సన్ని వేషాలు వివాదాలకు దారి తీసేలా ఉన్న నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతి తెలపలేదు. దీంతో ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిందని , యధావిధిగా పరాశక్తి విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలు కొన్ని సన్నివేశాలను సవరించిన అనంతరం సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసిందని 162 నిమిషాల 43 సెకండ్ల నిడివితో ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ఈ సినిమా సెన్సార్ కి సంబంధించి అధికారక ప్రకటన కూడా రాబోతోంది.
సెన్సార్ అభ్యంతరాలు, క్లియరెన్స్
ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ అభిమానులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగులో మరి కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే సంక్రాంతి బరిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తమిళ డబ్బింగ్ సినిమాలు మరి కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తుంది.
ఈ సినిమా 1965వ సంవత్సరంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవి మోహన్, దేవ్ రామనాథ్, అత్వర, బాసిల్ జోసెఫ్, రానా దగ్గుబాటి వంటి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కర్ నిర్మిస్తున్నారు. మరి ఎన్నో అవంతరాలను దాటుకుంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
తెలుగులో విడుదల వివరాలు
పరాశక్తి సినిమా విడుదల వాయిదా పడుతుందనే ఆందోళన తొలగడంతో అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుండటం విశేషం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.


