|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్ గిఫ్ట్: ఐశ్వర్య అర్జున్‌కు బ్రహ్మానందం ఏం ఇచ్చారో తెలిస్తే అవాక్కవుతారు!

Published: 10-02-2026, 1:35 PM
షాకింగ్ గిఫ్ట్: ఐశ్వర్య అర్జున్‌కు బ్రహ్మానందం ఏం ఇచ్చారో తెలిస్తే అవాక్కవుతారు!
  • ఐశ్వర్య అర్జున్‌కు బ్రహ్మానందం రాముడు, హనుమంతుడి చిత్రం బహుమతిగా ఇచ్చారు.
  • అర్జున్ సర్జా దర్శకత్వంలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా సీతా పయనం సినిమా వస్తోంది.
  • బ్రహ్మానందం స్వయంగా వేసిన చిత్రపటాన్ని ఐశ్వర్యకు అందజేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
  • అర్జున్ సర్జా తన ఫామ్ హౌస్‌లో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మానందం నటి ఐశ్వర్య అర్జున్‌కు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన కానుకను అందజేసి సర్ప్రైజ్ చేశారు. ఆ కానుక ఏమిటంటే స్వయంగా గీసిన రాముడు మరియు హనుమంతుడి చిత్రం.

ఐశ్వర్య అర్జున్‌కు బ్రహ్మానందం బహుమతి

Brahmanandam: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా, కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం ఎన్నో అద్భుతమైన సినిమాలలో కమెడియన్ గా నటించిన ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం బ్రహ్మానందం వయసు పై పడటంతో సినిమాలను కూడా తగ్గించారని చెప్పాలి కేవలం మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మానందం తాజాగా సీనియర్ నటుడు అర్జున్ సర్జా (Arjun Sarja)దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన దర్శకత్వంలో తన కుమార్తె ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun) హీరోయిన్ గా నటిస్తూ సీతా పయనం(Seetha Payanam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మానందం సినిమా గురించి అలాగే నటుడు అర్జున్ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు. ఇకపోతే నటి ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బ్రహ్మానందం ఊహించని కానుక ఇస్తూ సర్ప్రైజ్ చేశారు. బ్రహ్మానందంకు ఎంతో అద్భుతంగా ఆర్ట్ వేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈయన స్వయంగా గీసిన చిత్రపటాలను ఎంతోమంది హీరోలకు బహుమతిగా అందజేశారు.

సీతా పయనం సినిమాతో ఐశ్వర్య పరిచయం

ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మానందం ఆమెకు అద్భుతమైన కానుక ఇచ్చారు. స్వయంగా తన చేతులతో గీసిన రాముడు హనుమంతుడి చిత్రపటాన్ని అందజేశారు రాముడి కౌగిలిలో ఒదిగిపోయిన హనుమాన్ చిత్రపటాన్ని గీసిన బ్రహ్మానందం స్వయంగా తన చేతులతో ఐశ్వర్య అర్జునుకు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తాను స్వయంగా గీసాననే విషయాన్ని తెలియజేయడంతో అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. మామూలుగానే అర్జున్ హనుమంతుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు ఆయన ఏకంగా తన ఫామ్ హౌస్ లో హనుమంతుడి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. హనుమాన్ భక్తుడైన అర్జున్ కూతురుకు బ్రహ్మానందం కూడా అలాంటి చిత్రపటాన్ని కానుకగా అందించడంతో అర్జున్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

బ్రహ్మానందం కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య..

అర్జున్ సర్జా హనుమాన్ భక్తి

ఇలా చిత్రపటాన్ని అందుకున్న అనంతరం ఐశ్వర్య అర్జున్ బ్రహ్మానందం కాళ్లకు నమస్కరించడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక సీత పయనం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఐశ్వర్య అర్జున్ కు జోడిగాన్ నిరంజన్ హీరోగా నటించారు. నిజానికి ఈ సినిమాలో నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటించాల్సి ఉండగా పూజా కార్యక్రమాలు పూర్తయి సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి సినిమా నుంచి తప్పుకున్నారు. ఇలా విశ్వక తప్పుకోవడంతో నిరంజన్ ఈ సినిమాలో భాగమయ్యారు. మరి జనవరి 13వ తేదీ విశ్వక్ ఫంకీ సినిమాకు పోటీగా విడుదలవుతున్న సీతా పయనం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

మొత్తానికి బ్రహ్మానందం తనదైన శైలిలో ఐశ్వర్య అర్జున్‌కు అద్భుతమైన కానుకను అందజేసి ఆమెను సంతోషపరిచారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.