|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాముడు కేవలం పాత్ర కాదు.. మార్గదర్శకుడు! రణబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు!

Published: 31-03-2026, 6:35 AM
రాముడు కేవలం పాత్ర కాదు.. మార్గదర్శకుడు! రణబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు!
  • రాముడు పాత్రలో రణబీర్ కపూర్ నటన, ఆయన భావోద్వేగ ప్రసంగం.
  • ఏప్రిల్ 2న రామాయణం సినిమా గ్లింప్స్ విడుదల కానుంది.
  • ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు.
  • 2026, 2027 దీపావళికి రెండు భాగాలుగా సినిమా విడుదల కానుంది.

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ రాముడి పాత్ర గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రాముడు కేవలం ఒక పాత్ర కాదని, మార్గదర్శి అని అన్నారు. ఈ సినిమా గ్లింప్స్ ఏప్రిల్ 2న విడుదల కానుంది.

రాముడి గురించి రణబీర్ కపూర్ భావోద్వేగం

Ranbir Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రణబీర్ కపూర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ రెండవ తేదీ ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా గ్లింప్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లోని ఐమ్యాక్స్ లో ప్రసారం చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ రాముడు(Lord Rama) అంటే ఒక పాత్ర మాత్రమే కాదు ఎన్నో కోట్ల మంది భక్తులకు మార్గదర్శి, ఆత్మసాక్షి అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. ధర్మానికి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన శ్రీ రాముడి పాత్రలో నటించడం నాకు దక్కిన గౌరవం అంటూ రణబీర్ కపూర్ ఈ సందర్భంగా రాముడి పాత్ర పోషించడం గురించి శ్రీరాముడి గురించి తన మనసులో భావాలను తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామాయణం సినిమా గ్లింప్స్ విడుదల

ఏప్రిల్ రెండవ తేదీ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది .ఇక ఈ వీడియో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ వీడియో 2:38 రన్ టైం ఉందని తెలుస్తుంది. ఇక ఈ గ్లింప్స్ ద్వారా ఈ సినిమాలో నటీనటుల పాత్రులను పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాగా రెండవ భాగం 2027 దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో సాయి పల్లవి నటించబోతున్నారు. ఇక రావణాసురుడిగా కేజిఎఫ్ స్టార్ యశ్ విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామాయణం నేపథ్యంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రామాయణ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్,మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

సినిమాలో నటీనటుల వివరాలు

రణబీర్ కపూర్ మాటలు రామాయణం సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి. త్వరలో గ్లింప్స్ విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.