|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఢిల్లీలో మోడీతో ‘పరాశక్తి’ టీమ్ సంబరాలు! అసలేం జరిగింది?

Published: 15-01-2026, 3:00 AM
ఢిల్లీలో మోడీతో 'పరాశక్తి' టీమ్ సంబరాలు! అసలేం జరిగింది?
  • పరాశక్తి చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 10న విడుదలైంది, విమర్శలు ఎదుర్కొంటోంది.
  • సినిమా టీమ్ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసింది, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
  • కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ, పరాశక్తి టీమ్ పాల్గొన్నారు.
  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని మోదీ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

శివ కార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ సినిమా విడుదలైన తర్వాత వివాదాల్లో చిక్కుకుంది. అయితే, ఈ సినిమా టీమ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి పొంగల్ వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రధానితో పరాశక్తి టీమ్ భేటీ

Parasakthi : తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం పరాశక్తి.. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలోకి వచ్చేసింది.. సినిమా మొదటి నుంచి విమర్శలు అందుకుంటుంది. దీంతో విడుదల కూడా వాయిదా పడింది. ఎట్టకేలకు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అయితే రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి విమర్శలు కూడా అందుకుంటూ వస్తుంది. దాంతో సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా తగ్గడంతో పాటుగా, బ్యాన్ చెయ్యాలంటు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మూవీ టీమ్ బీజేపీ నేత, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నరేంద్ర మోడీతో భేటీకి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

భారత ప్రజలు సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ నివాసంలో బుధవారం పొంగల్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ వేడుకలకు తమిళనాడుకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ తో పాటుగా రీసెంట్ గా విడుదలైన తమిళ మూవీ ‘పరాశక్తి’ టీమ్ కూడా హాజరైంది. మోడీతో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఏప్రిల్‌-మే నెల మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్నీ ప్రధాని వదులుకోకపోవడం గమనార్హం.. మరి తమిళ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని గెలిపిస్తారేమో చూడాలి.

పొంగల్ వేడుకల్లో మోడీ సందడి

విమర్శల నడుమ సినిమా విడుదల

తమిళ హీరో శివ కార్తికేయన్, శ్రీ లీల జంటగా నటించిన తాజా చిత్రం పరాశక్తి.. ప్రముఖ డైరెక్టర్ సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్ లోకి వచ్చింది.. అయితే తమిళంలో పెద్దగా ఈ సినిమా ఆకట్టుకోకపోవడంతో పాటుగా విమర్శలను అందుకోవడంతో తెలుగులో సినిమాని రిలీజ్ చెయ్యలేదు. 1960లలో విద్యార్థి ఉద్యమం, హిందీ వ్యతిరేక నిరసనలు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.. అయితే సెన్సార్ కి వెళ్ళిన ఏ సినిమాకు 23 కట్స్ చెప్పారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలు పరాశక్తి సినిమాపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ ని వక్రీకరిస్తూ ఈ సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయని, సినిమాను బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో అని జనాలు వెయిట్ చేస్తున్నారు. ఈ విమర్శలు కొనసాగుతున్న సందర్భంలో బీజేపీ నేతలతో ఈ మూవీ కనిపించడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. దీనిపై టీమ్ వివరణ ఇస్తారేమో చూడాలి.. ఇక ఈ సినిమాకు ఒకవైపు విమర్శలు వస్తున్న సరే.. మరోవైపు మాత్రం కలెక్షన్లు కూడా భారీగానే వసూలు అవుతున్నాయని తెలుస్తుంది..

పరాశక్తి చిత్రం విడుదలైన కొద్ది రోజులకే ప్రధాని మోడీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.