|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Patang Trailer: యుద్ధాలు చేయకుండా రాజ్యాలు గెలవలేము..ఆసక్తికరంగా పతంగ్ ట్రైలర్!

Published: 15-12-2025, 2:48 AM
Patang Trailer: యుద్ధాలు చేయకుండా రాజ్యాలు గెలవలేము..ఆసక్తికరంగా పతంగ్ ట్రైలర్!
  • ‘పతంగ్’ సినిమా ట్రైలర్ విడుదలై వైరల్‌గా మారింది, డిసెంబర్ 25న విడుదల.
  • ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించి సందడి చేశారు.
  • స్నేహితులు ప్రేమకథలో శత్రువులుగా మారే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో సినిమా తెరకెక్కింది.
  • “యుద్ధాలు చేయకుండా రాజ్యాలు గెలవలేము” వంటి డైలాగ్స్ ట్రైలర్ లో హైలైట్‌గా నిలిచాయి.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’ సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రణవ్, వంశీ, ప్రీతిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ, స్నేహం, శత్రుత్వం ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ: స్నేహం నుండి శత్రుత్వం!

Patang Trailer: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పతంగ్ సినిమా(Patang Movie) కూడా డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఈ సినిమాలో ప్రణవ్ కౌశిక్(Pranav Kaushik) వంశీ పూజిత్ (Vamshi Poojith) ప్రీతి పగడాల(Preethi Pagadala) ప్రధాన పాత్రలలో నటించి సందడి చేశారు. ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాలో ప్రణవ్ వంశీ ప్రీతి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే స్పష్టమవుతుంది. మంచి స్నేహితులుగా ఉన్న ప్రణవ్, వంశీ చివరికి ప్రీతి కోసం పెద్ద ఎత్తున గొడవలు పడి శత్రువులుగా మారుతారని ఈ ట్రైలర్ వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రీతి ఐశ్వర్య పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. యుద్ధాలు చేయకుండా రాజ్యాలు గెలవలేము, సీత స్వయంవరం కోసం ఎంతో మంది రాజులు వచ్చారు అంటూ సాగిపోయే డైలాగ్స్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి.

ఆకట్టుకుంటున్న డైలాగ్స్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్

ఐశ్వర్య కోసంప్రణవ్ కౌశిక్ (అరుణ్),వంశీ పూజిత్ (విస్కీ)SPB చరణ్ (శేఖర్) పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కామెడీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మరి డిసెంబర్ 25వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని విజయ్ శేఖర్ అన్నే సంపత్ మాకా, సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక్కడ ట్రైలర్ వీడియో కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేస్తుంది.

ఇక డిసెంబర్ 25వ తేదీని పురస్కరించుకొని శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన ఛాంపియన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాగే ఆది సాయికుమార్ హీరోగా నటించిన శంభాల సినిమా కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక హెబ్బా పటేల్ త్రిగున్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈషా అనే హర్రర్ సినిమా కూడా క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఈ క్రిస్మస్ బరిలో దిగబోతున్న ఈ సినిమాలలో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాల్సి ఉంది.

క్రిస్మస్ బరిలో పతంగ్: పోటీ ఎలా ఉంది?

మొత్తంమీద, ‘పతంగ్’ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. క్రిస్మస్ పోటీలో నిలబడి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. డిసెంబర్ 25న ప్రేక్షకుల తీర్పు వెలువడనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.