
📌 Key Points
- అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు తిరిగి దోహాలో ప్రారంభం కానున్నాయి.
- ఖతర్ లో జరిగిన సమావేశంలో కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.
- ఈ వారంలోనే దోహాలో తదుపరి కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.
- హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు ఎత్తివేతపై చర్చలు జరగనున్నాయి.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఖతర్ రాజధాని దోహాలో మరోసారి శాంతి చర్చలు జరగనున్నాయి. గతంలో పరస్పర దాడుల తర్వాత ఇప్పుడు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే యుద్ధానికి ముగింపు పడవచ్చు.
శాంతి దిశగా అమెరికా-ఇరాన్ అడుగులు
ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. డీల్ కుదుర్చుకొని ఆపై మళ్ళీ పరస్పర దాడులు చేసుకుంటున్న అమెరికా, ఇరాన్ దేశాలు ఇప్పుడు శాంతించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఖతర్ లో జరిగిన సమావేశంలో కాల్పులు నిలిపివేసేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు యాక్సియాస్ సంస్థ అధికారిగా ప్రకటన చేసింది. ఇక ఈ వారంలోనే ఆ దేశ రాజధాని దోహాలు మరోసారి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు హర్మూజ్ లో నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు అని ఇరుపక్షాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అనేక దేశాల నౌకలు ఈ జలసంధి ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇక దోహా వేదికగా శాంతి చర్చలు సఫలం అవుతే.. యుద్ధానికి ఎండ్ కార్డు పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
దోహాలో మళ్ళీ కీలక సమావేశం
హర్మూజ్ జలసంధిపై ప్రభావం
దోహాలో జరగనున్న ఈ చర్చలు ప్రపంచ శాంతికి అత్యంత కీలకం. ఇరు దేశాలు శాంతించి, కాల్పుల విరమణకు కట్టుబడితే, హర్మూజ్ జలసంధిలో వాణిజ్యానికి మార్గం సుగమం అవుతుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా సానుకూల ప్రభావం చూపుతాయి.


