
Key Points
పవిత్ర లోకేశ్ ఫోన్ ట్యాప్ అయినట్లు వార్తలు
ఎవరి కోసం ఈ ట్యాపింగ్ అనేది ప్రశ్నార్థకం
నరేశ్ తో పెళ్ళి తర్వాత మరోసారి వార్తల్లో పవిత్ర
పవిత్ర లోకేశ్ ఫోన్ ట్యాపింగ్ విషయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. ఎంతో మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని.. సోషల్ మీడియాలో లిస్ట్ కూడా వైరల్ అవుతోంది. ఈ క్రమంలో నటి పవిత్ర లోకేశ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని తెలుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు లాగారని టాక్ నడుస్తోంది. కాగా అసలు ఈమె ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగమని నెట్టింట ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె సీక్రెట్స్ తెలుసుకోవడం వల్ల ఎవరికి లాభమనే చర్చ జరుగుతోంది. ఎవరి కోసం చేసుంటారనే కామెంట్స్ వస్తున్నాయి. పవిత్రను అడ్డం పెట్టుకుని ఎవరి భూములు కొట్టేయాలని ప్లాన్ వేశారని అడుగుతున్నారు నెటిజన్లు.
కాగా నటి పవిత్ర లోకేశ్.. మొదటి భర్తను వదిలేసింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు నరేశ్‌ను పెళ్లి చేసుకుంది. ఇది నరేశ్‌కు మూడో రిలేషన్ కాగా ఈ విషయంలో రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. లిప్ కిస్సులతో ఫొటోలు రిలీజ్ చేస్తూ ఇద్దరు వైరల్ అయిపోయిగా.. ప్రస్తుతం పవిత్ర మరోసారి ట్రెండ్ అవుతోంది.


