|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తల్లి పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ సంచలనం! జూపార్క్‌లో ఏం చేశారంటే?

Published: 29-01-2026, 8:05 AM
తల్లి పుట్టినరోజు వేడుకలో పవన్ కళ్యాణ్ సంచలనం! జూపార్క్‌లో ఏం చేశారంటే?
  • పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవి పుట్టినరోజున రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు.
  • ఇందిరా గాంధీ జూపార్కులో జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్, వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టారు.
  • మెగా కుటుంబం జంతువుల పట్ల ప్రేమను కనబరుస్తూ తమవంతు సహాయం చేస్తున్నారు.
  • పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఓజీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును పురస్కరించుకుని ఇందిరా గాంధీ జూపార్క్‌లో రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జంతువుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. మెగా కుటుంబం కూడా జంతువుల సంరక్షణలో ముందుంది.

తల్లిపై ప్రేమతో పవన్ కళ్యాణ్ నిర్ణయం

Pawan kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా తన తల్లి కోసం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు తన అమ్మ అంజనాదేవి(Anjana Devi) అంటే ఎంత ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు తన తల్లి పట్ల ప్రేమను చాటుకుంటూ ఉంటారు.

ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి పుట్టినరోజు కావడంతో ఈయన తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఇందిరా గాంధీ జూ పార్కులో రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తెలియచేయడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యకలాపాలలో భాగంగా నేడు ఇందిరా గాంధీ జూపార్కును(Indhira Gandhi Zoo park) సందర్శించారు. ఈ నేపథ్యంలోనే రెండు జిరాఫీల(Giraffe)ను ఏడాది పాటు తన తల్లి పేరు మీద దత్తత తీసుకొని వాటి బాగోగులను, వాటికి అయ్యే ఖర్చులను పవన్ కళ్యాణ్ భరించబోతున్నట్లు తెలియజేశారు. ఇలా పవన్ రెండు జిరాఫీలను దత్తత తీసుకుంటూ జంతువుల పట్ల తన ఉదారత స్వభావాన్ని చాటుకున్నారు.

జూపార్క్‌లో జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

ఇక మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఇదివరకే ఉపాసన కూడా తన పేరు మీద కొన్ని పులులను ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. అలాగే రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కార రెండో పుట్టినరోజు సందర్భంగా మరొక పులిని కూడా దత్తత తీసుకొని వాటి బాగోగులను ఉపాసన చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా మెగా కుటుంబ సభ్యులు జంతువుల పట్ల కూడా చూపిస్తున్నటువంటి ఈ ప్రేమకు అభిమానులు ఫీదా అవుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ స్థాయిలో సక్సెస్ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇకపోతే  ఏడాదిలో మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh)సినిమా షూటింగ్ పనులను పూర్తిచేసుకొని డబ్బింగ్ పనులను మొదలుపెట్టారు. ఈ సినిమా మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుందని తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీ గురించి సరైన స్పష్టత రానుంది.

జంతువుల పట్ల మెగా కుటుంబ సభ్యుల అభిమానం

పవన్ కళ్యాణ్ తన తల్లి పుట్టినరోజున జిరాఫీలను దత్తత తీసుకోవడం ఆయన మంచి మనసుకి నిదర్శనం. రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన కుటుంబానికి, సమాజానికి ఆయన ప్రాధాన్యతనిస్తున్నారని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.