
📌 Key Points
- ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ కంటతడి, రెండు నిమిషాలు బ్రేక్ తీసుకున్నారట.
- మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల, ధురంధర్ 2 కూడా అదే రోజు రిలీజ్ అవుతుండటం ఆసక్తికరం.
- దురంధర్ 2 మంచి సినిమానే కానీ, మా సినిమాకు పోటీ కాదని హరీష్ శంకర్ కామెంట్.
- తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కు మంచి క్రేజ్ ఉందని హరీష్ శంకర్ తెలిపారు.
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. డబ్బింగ్ చెబుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారట! పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
డబ్బింగ్ లో పవన్ ఎమోషనల్.. కారణం ఇదే!
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాను మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో హరీష్ శంకర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాడు. తాజాగా హరీష్ శంకర్ ఈ సినిమా డబ్బింగ్ సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలియజేశాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ vs ధురంధర్ 2: పోటీ ఉంటుందా?
హరీష్ శంకర్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా డబ్బింగ్ చెప్పే సమయంలో ఓ సన్నివేశం వచ్చేసరికి కంటతడి పెట్టుకున్నారు, కంటతడి పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఓ రెండు నిమిషాలు ఆగి నీళ్లు తాగి ఆ తర్వాత డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. అంతలా ఆయన ఆ సీన్లో ఇన్వాల్వ్ అయ్యారు అని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. కొంతకాలం క్రితం విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకున్న ధురంధర్ సినిమా సీక్వెల్ ‘ధురంధర్ 2’ను కూడా మార్చి 19న విడుదల చేయనున్నారు. దానితో చాలామంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఇది గట్టి పోటీ అని భావిస్తున్నారు.
హరీష్ శంకర్ కామెంట్స్: సినిమా విడుదలపై క్లారిటీ!
తాజా ఇంటర్వ్యూలో భాగంగా ‘హరీష్ శంకర్’కి ‘ధురంధర్ 2’తో పాటు మీ సినిమాను విడుదల చేస్తున్నారు, అది రిస్క్ అని మీరు అనుకోవట్లేదా అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ… దురంధర్ 1 చాలా గొప్ప విజయం సాధించింది. దురంధర్ 2 పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ మాది ఫ్యాన్ ఇండియా సినిమా కాదు, తెలుగు రాష్ట్రాల్లో మా సినిమాకు మంచి క్రేజ్ ఉంది. అలాగే ‘ధురంధర్’కు మా సినిమాకు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో రెండు, మూడు సినిమాలు విడుదల అయినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు, అలాంటి తేదీనే మార్చి 19 అనుకుంటున్నాం. అందుకే సమిష్టిగా అందరం కూర్చుని మాట్లాడుకొని ఈ తేదీన విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాము అని ఆయన సమాధానం ఇచ్చాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అవ్వడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


