|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan : సినీ పరిశ్రమ, థియేటర్స్ పై డిప్యూటీ సీఎం లెటర్ విడుదల.. ఇకపై డైరెక్ట్ గా ఎవరూ కలవద్దు..

Published: 24-05-2025, 10:52 AM
Pawan Kalyan : సినీ పరిశ్రమ, థియేటర్స్ పై డిప్యూటీ సీఎం లెటర్ విడుదల.. ఇకపై డైరెక్ట్ గా ఎవరూ కలవద్దు..

తాజాగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి సినీ పరిశ్రమకు ఒక ఘాటైన లేఖ విడుదలైంది. థియేటర్ సమస్యలు, నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య వివాదాలు, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

డిప్యూటీ సీఎం ఆఫీస్ నుండి సినీ పరిశ్రమకు ఘాటైన లేఖ విడుదల.

2

థియేటర్స్ సమస్య, నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య వివాదాలు.

4

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పై ప్రభావం.

థియేటర్స్ సమస్యలు మరియు వివాదాలు

Pawan Kalyan : గత కొన్ని రోజులుగా థియేటర్స్ సమస్య నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య సాగుతుంది. ఈ వివాదాలు టాలీవుడ్ లో పెద్ద సమస్యగానే మారింది. అయితే ఇది హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ని టార్గెట్ పెట్టుకొనే జరుగుతుందని వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై, ప్రభుత్వంపై విమర్శలు చేసారు. అయితే తాజాగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఒక ఘాటైన లెటర్ ని రిలీజ్ చేసారు.

ఏపీలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. NDA కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు. కేవలం తమ సినిమాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదు. అందరూ కలసి రావాలి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు చెప్పినా సానుకూలంగా స్పందించలేదు.

డిప్యూటీ సీఎం లేఖ ముఖ్యాంశాలు

తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకొని ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు, సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదు అని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది. కక్ష సాధింపులకు దిగేది. తమకు నచ్చనివారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులుపెట్టిందో నిర్మాతలు మరచిపోతే ఎలా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కల్యాణ్ గారు చెప్పిన విధంగానే – కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందినవారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బందిపడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానం.

తెలుగు సినిమా రంగంవారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి, టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కల్యాణ్ గారు సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, సుప్రియ, చినబాబు, అశ్వనీదత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. అయినా ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తూనే ఉంది.

ప్రభుత్వం మరియు సినీ పరిశ్రమ మధ్య సంబంధాలు

సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న పవన్ కల్యాణ్ గారికి తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. డైరెక్ట్ గా ఎవరూ రావొద్దు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించింది. అదే విధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు ఆలోచన చేశారు. దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించనున్నారు. అనంతరం కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారు అని తెలిపారు.

అలాగే థియేటర్ల ఆదాయంపై, వాళ్ళు కట్టే ట్యాక్సులపై, ఎన్ని మల్టీప్లెక్సులు ఉన్నాయి అంటూ అన్ని లెక్కలు బయటకి తీయాలని, అన్నిటిని పరిశీలించాలని డిప్యూటీ సీఎం కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ లేఖ సినీ పరిశ్రమలో చర్చగా మారింది. మరి దీనిపై టాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

డిప్యూటీ సీఎం లేఖతో సినీ పరిశ్రమకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఒక హెచ్చరిక లాంటిది. ప్రభుత్వం మరియు సినీ పరిశ్రమ మధ్య సంబంధాలు మరింత తెలియని దిశలో సాగుతున్నట్లు కనిపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.