
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పూర్తయింది. అంతేకాదు, OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు కూడా ఆయన తేదీలు ఖరారు చేశారు. ఈ సినిమాల విడుదల తేదీల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Key Points
పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తి చేశారు.
OG సినిమా షూటింగ్ మే 14 నుంచి ప్రారంభం.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే పూర్తి కానుంది.
మూడు సినిమాల అప్డేట్స్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రమైన హరిహర వీరమల్లు(Harihara Veeramallu)లో ఆయన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం షూటింగ్‌కు వచ్చిన పవన్.. ఆయన పోర్షన్‌ను పూర్తి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హరిహర వీరమల్లుతో పాటు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో రెండు సినిమాలకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మే 14వ తేదీ నుంచి సుజిత్(Sujith) కాంబినేషన్‌లో వస్తోన్న ఓజీ(OG)కి డేట్స్ ఇచ్చాడని.. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం ఈనెలలోనే పూర్తి చేసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్న సమయానికి ఓజీ షూటింగ్ పూర్తయితే.. సెప్టెంబర్‌లో విడుదల ఉంటుందని తెలుస్తోంది. ఇక ఓజీ తర్వాత హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) సినిమాకు కూడా డేట్స్ ఇచ్చాడని.. దీనిని కూడా ఈ ఏడాదే పూర్తి చేసి.. వచ్చే సమ్మర్‌లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. థాంక్యూ డిప్యూటీ సీఎం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు షెడ్యూల్
కాగా, హరిహర వీరమల్లులో పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని ఏమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఓజీలో ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తోండగా.. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది.
ఫ్యాన్స్ ఆనందోత్సాహం
#PawanKalyan ’s Upcoming movie Schedules 🔥 #HHVM #TheyCallHimOG #UstaadBhagatSingh pic.twitter.com/Z6t4qRV4QG
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గొప్ప వార్త. మూడు సినిమాల అప్డేట్స్ వారి ఆనందాన్ని పెంచుతున్నాయి. ఈ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి.


