|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ టైటిల్ లీక్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 27-01-2026, 8:05 AM
పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ టైటిల్ లీక్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబోలో రానున్న మూవీపై భారీ అంచనాలు!
  • వక్కంతం వంశీ కథ అందించగా.. రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు.
  • మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.. ఈ ఏడాది చివరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు!
  • పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తరహాలోనే ఈ సినిమా టైటిల్ కూడా రెండు అక్షరాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాతో మళ్లీ సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ మూవీ.. స్టోరీ అదిరిందట!

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్ట్ చేస్తున్న‌ మూవీ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఇంతలోనే పవన్‌ చేయబోయే నెక్స్ట్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్ చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ మూవీని లాంచింగ్‌ చేసి.. షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా, వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి డైరెక్టర్‌గా పవన్‌ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో ఓ టాక్‌ వినిపిస్తుంది.

మార్చి నుండి షూటింగ్ స్టార్ట్.. ఈ ఏడాదిలోనే రిలీజ్!

సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో పవన్ చేయబోయే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి స్టార్ట్ కాబోతోందట. గతంలో పవన్ తనకు టైమ్ దొరికినప్పడల్లా సినిమాలకు టైమ్ ఇచ్చి ఫినిష్ చేస్తుండేవాడు. ఈసారి కూడ పవన్ అలానే చెయ్యబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

రెండు అక్షరాల టైటిల్ తో వస్తున్న పవర్ స్టార్!

అయితే సినిమాను చాలా త్వరగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక టైటిల్ కూడా రెండు అక్షరాలు మాత్రమే ఉంటుందనే టాక్ నడుస్తుంది. పవన్ ఓజీకి రెండు అక్షరాలే. ఈ సారి కూడ ఇదే సెంటిమెంట్‌తో పాటు మాస్ రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేస్తున్నారట. మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళి.. ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.