
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం OG సినిమా నుండి మొదటి పాట ‘ఫైర్ స్టార్మ్’ విడుదలైంది. తెలుగుతో పాటు జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైన ఈ పాటకు థమన్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ పాట విడుదలతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
Key Points
పవన్ కళ్యాణ్ OG సినిమా ఫస్ట్ సాంగ్ 'ఫైర్ స్టార్మ్' రిలీజ్.
తెలుగు, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో పాట విడుదల.
శింబు, థమన్, దీపక్, నజీరుద్దీన్, భరత్ రాజ్, రాజకుమారి గానం.
OG సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్
They Call Him OG : పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. త్వరలో సెప్టెంబర్ 25న OG సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే OG సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే OG సినిమా నుంచి గ్లింప్స్ రిలీజవ్వగా అతాజాగా మొదటి పాటను రిలీజ్ చేసారు.
ఫైర్ స్టార్మ్ సాంగ్ అంటూ ఈ పాటను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ ను తెలుగు తో పాటు జపనీస్, ఇంగ్లీష్ భాషలో కూడా కలిపి రాసినట్టు తెలుస్తుంది. సాంగ్ కి థమన్ అయితే మ్యూజిక్ అదరగొట్టేసాడు.ఈ పాటని తమిళ్ స్టార్ హీరో శింబుతో పాటు థమన్, దీపక్, నజీరుద్దీన్, భరత్ రాజ్, రాజకుమారి కలిపి పాడారు. ఈ సాంగ్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సాంగ్ లో తెలుగు లిరిక్స్ ని విశ్వ, శ్రీనివాస మౌళి రాయగా, ఇంగ్లీష్ లిరిక్స్ ని రాజకుమారి రాయగా, జపనీస్ లిరిక్స్ ని అద్వితీయ వొజ్జల రాశారు.
మూడు భాషల్లో పాట విడుదల
థమన్ సంగీతం ప్రశంసలు
మీరు కూడా ఈ పాటను వినేయండి..
మొత్తం మీద, పవన్ కళ్యాణ్ OG సినిమా ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను అలరించింది. థమన్ సంగీతం, అద్భుతమైన గానం సినిమాపై అంచనాలను పెంచాయి.


