
రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన నటించే ‘OG’ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Key Points
పవన్ కళ్యాణ్ 'OG' సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమైంది.
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ 'OG'.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వార్తతో సంతోషంగా ఉన్నారు.
‘OG’ సినిమా షూటింగ్ ప్రారంభం
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రజెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అలాగే గతంలో ఆయన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేందుకు రీసెంట్‌గా షూటింగ్ సెట్(Shooting set)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘హరహర వీరమల్లు’ (Harahara Veeramallu)కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ఇటీవల షూటింగ్‌లో జాయిన్ అయినా ఆయన.. ఇప్పుడు మరో చిత్రం షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. పవన్ కల్యాణ్ ఒప్పుకున్న చిత్రాల్లో ‘ఓజీ’ (OG) ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సుజిత్ (Sujith) దర్శకత్వం వహిస్తు్న్నాడు. ఇందులో బాలీవుడ్ (Bollywood) నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనపించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా కెమెరా డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సభ్యుడు ‘ఈరోజు ఓజీ షూటింగ్ ప్రారంభమైంది’ అంటూ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతుండగా.. ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ‘మళ్లీ మొదలైంది.. ఈసారి మోగిపోద్ది’ అంటూ డీవీడీ ఎంటర్‌టైన్మెంట్ మరో ట్వీట్ పెట్టింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతుండగా.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
A post shared by DVV Entertainment (@dvvmovies)
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యం
పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందం
చివరిగా, పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా షూటింగ్ పునఃప్రారంభం అభిమానులను ఉత్సాహపరిచింది. ఈ సినిమా విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.


