|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కల్యాణ్ ‘OG’కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Published: 22-09-2025, 3:20 AM
పవన్ కల్యాణ్ ‘OG’కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘OG’ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతోంది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే విధంగా ఏపీ ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది.

Key Points

1

పవన్ కల్యాణ్ ‘OG’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుండి టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి.

2

సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.120 పెంపుకు అనుమతి.

4

ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం నుండి టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓజీ చిత్రం(OG Movie) సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రబృందానికి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) శుభవార్త చెప్పింది. సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.120 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పది రోజుల పాటు పెంచిన రేట్లు అమలులో ఉండనున్నాయి. మరోవైపు ఇప్పటికే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మెమో జారీ చేశారు. ఏపీలో 25వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు రూ.1000 టికెట్ రేట్‌తో ప్రదర్శించుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.125 గాను, అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.150 గాను నిర్ధారించారు. ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయని వెల్లడించింది. కాగా, ఓజీ సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మూవీ విడుదల కోసం వారంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచడంపై పవన్ డైహార్డ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు.

ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి

పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంతో పవన్ కల్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘OG’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.