
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ఒక టొబాకో బ్రాండ్ ప్రమోషన్ కోసం వచ్చిన రూ. 40 కోట్ల ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు.
- ఆరోగ్యానికి హానికరమని తెలిసిన టొబాకోను ప్రోత్సహించకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
- గతంలో పవన్ కళ్యాణ్ చేనేత పరిశ్రమ మరియు జీవన్ దాన్ వంటి వాటిని ప్రోత్సహించారు.
- పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల అభిమానులు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయనను ప్రశంసిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక టొబాకో బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి వచ్చిన 40 కోట్ల రూపాయల భారీ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ జీవితం
Pawan Kalyan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒకరు. చిరంజీవి తమ్ముడిగానే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తన టాలెంట్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో నటించినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈయనకున్నంత క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే హీరోకి లేదని చెప్పాలి. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించిన పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాలకు కాస్త దూరమవుతూ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితం అయినప్పటికీ ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. ఇక పాలిటిక్స్ లోకి రావడంతో ఈయన పాన్ ఇండియా పొలిటికల్ లీడర్ గా గుర్తింపు పొందారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలు మాత్రమే చేస్తారు కానీ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కు పూర్తిగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కళ్యాణ్ చేనేత పరిశ్రమ, జీవన్ దాన్ అవయవ దాన వంటి వాటిని ప్రమోట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పించారు. ఇక సినిమాలలో హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయన పెప్సీ కూల్ డ్రింక్ కు బ్రాండ్ ఎండార్స్మెంట్ చేశారు.
టొబాకో ఆఫర్‌ను తిరస్కరించడానికి కారణం
ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నారు అయితే ఈయన సినిమాలలోను రాజకీయాలలోను సక్సెస్ అయిన తర్వాత ప్రముఖ టొబాకో కంపెనీ తమ బ్రాండ్ ప్రమోట్ చేయాల్సింది అంటూ పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారని తెలుస్తోంది. తమ టొబాకో బ్రాండ్ ప్రమోట్ చేసినందుకు 40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ ఆఫర్ సున్నితంగా రిజెక్ట్ చేశారట. టొబాకో ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. అంతే కాకుండ పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు అంటూ ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మార్చిలోనే ఉస్తాద్ భగత్ సింగ్..
అభిమానుల స్పందన, ప్రశంసలు
ఈ విధంగా పవన్ కళ్యాణ్ 40 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సింపుల్ గా నో చెప్పడంతో అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సామాజిక బాధ్యత ఉన్న పౌరుడిగా పవన్ కళ్యాణ్ చేస్తుంది కరెక్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఓజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు మార్చ్ లో విడుదల అవ్వాల్సిన రామ్ చరణ్ నాని సినిమాలు వాయిదా పడటంతో మార్చి నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సామాజిక బాధ్యతతో తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులకు ఆదర్శంగా నిలుస్తోంది. డబ్బు కంటే సమాజ శ్రేయస్సు ముఖ్యమని ఆయన చాటి చెప్పారు. ఆయన చేస్తున్న మంచి పనులకు ఇది నిదర్శనం.


