
📌 Key Points
- పవన్ కళ్యాణ్ గతంలో ‘OG’ చిత్రంతో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరారు.
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు రూ. 100 కోట్లు సాధిస్తే పవన్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంటారు.
- ఈ చిత్రం సుమారు రూ.120 – రూ. 130 కోట్ల ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.
- పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ గతంలో ‘గబ్బర్ సింగ్’తో రికార్డులు సృష్టించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందా లేదా అనే దానిపై ట్రేడ్ వర్గాలలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
రూ. 100 కోట్ల క్లబ్‌లో పవన్ కళ్యాణ్
Pawan Kalyan: భారతీయ సినీ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ.100 కోట్ల గ్రాస్ సాధించడం అనేది ఒక అసాధారణమైన విషయం. ప్రస్తుతం ఈ ఘనతను ఒకటి కంటే ఎక్కువసార్లు (Multiple times) సాధించిన హీరోలు వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే ఉన్నారు. ప్రభాస్, రజనీకాంత్, విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు మాత్రమే ఈ ‘ఎలైట్ క్లబ్’లో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ట్రేడ్ వర్గాల ఫోకస్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన రాబోయే చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పైనే ఉంది.
Read also- Thriller movie OTT: మహిళలకు నరకం చూపించే వింత సైకో… సూదులు గుచ్చి వెర్రి వేషాలు… చూస్తే బుర్ర పాడే
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు
పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన గత చిత్రంతో (OG) రూ. 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. అయితే, పైన పేర్కొన్న హీరోల సరసన చేరాలంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో మరోసారి మొదటి రోజే రూ.100 కోట్ల మార్కును అందుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది జరిగితే, ఒకటి కంటే ఎక్కువ సార్లు రూ.100 కోట్ల ఓపెనింగ్ సాధించిన అతికొద్ది మంది భారతీయ నటుల్లో పవన్ ఒకరిగా నిలుస్తారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఒక మాస్ వైబ్. గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్లీ అదే పోలీస్ గెటప్‌లో పవన్ కనిపిస్తుండటంతో క్రేజ్ మామూలుగా లేదు. గత కొన్ని ఏళ్లుగా తెలుగు సినిమాల మార్కెట్ కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాకుండా గ్లోబల్ వైడ్‌గా పెరిగింది. ఓవర్సీస్ నార్త్ ఇండియా మార్కెట్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్ లోని డైలాగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” అన్న డైలాగ్ బాక్సాఫీస్ వద్ద నిజం అవుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Read also- Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..
బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ స్టామినా
మార్చి 26న విడుదల కానున్న ఈ చిత్రం, సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకోనుంది. సుమారు రూ.120 – రూ. 130 కోట్ల ఓపెనింగ్ రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే, సౌత్ ఇండియా నుంచి అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన అతికొద్ది మంది హీరోల్లో పవన్ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ స్టామినాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పే ఆయుధం. మరి పవర్ స్టార్ ఆ ‘ఎలైట్ క్లబ్’ లో గ్రాండ్‌గా ఇన్వాల్వ్ అవుతారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే సినిమా అనుకున్న తేదీ కన్నా ముందే రానున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు అయితే ఈ సినిమా మార్చి 19 తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


