|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ అందుకున్నది ఊహించని మొత్తం! రెమ్యూనరేషన్ వివరాలు లీక్!

Published: 07-03-2026, 9:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కళ్యాణ్ అందుకున్నది ఊహించని మొత్తం! రెమ్యూనరేషన్ వివరాలు లీక్!
  • ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న విడుదల కానుంది, టీజర్ త్వరలో రానుంది.
  • పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
  • గతంలో పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ హిట్ అయింది.
  • ఈ చిత్రంలో పవన్ పోలీస్ యూనిఫామ్ లో కనిపించనున్నారు, శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ఖరారు!

Pawan Kalyan: సినీనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విడుదలకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా డబ్బింగ్ పనులలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయడానికి కూడా చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా మార్చ్ 26వ తేదీ విడుదల కావాల్సి ఉండగా 19వ తేదీ విడుదల కాబోతున్న టాక్సిక్ సినిమా వాయిదా పడటంతో ఉగాది పండుగను పురస్కరించుకొని ఉస్తాద్ భగత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన రెండు పాటలు మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే టీజర్ విడుదల కాబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా సమాచారం మేరకు ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాల క్రితం పవన్ 5 కోట్ల రూపాయల తీసుకున్నారట. ఈ సినిమా ఆలస్యం కావడంతో అప్పటినుంచి పవన్ ఎలాంటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని, అయితే ఈ సినిమా కోసం పవన్ రూ. 25 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోవడం కోసం అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పై వైరల్ అవుతున్న వార్తలు

ఈ రెమ్యూనరేషన్ తో పాటు ఈ సినిమా మంచి లాభాలను అందుకుంటే వాటా తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఇదివరకు గబ్బర్ సింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి . ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ యూనిఫామ్ ధరించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో పవన్ జోడిగా నటి శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ రంగంలోకి దిగారు. ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అభిమానులకు ఎలాంటి ఫీస్ట్ ఇవ్వనుందో తెలియాల్సి ఉంది. ఇటీవల పవన్ నటించిన ఓజి సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.

పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ పై అంచనాలు

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ రెమ్యూనరేషన్ వార్తలకు మరింత ఆసక్తి నెలకొంది. సినిమా విడుదల కోసం ఎదురుచూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.