|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ గొప్ప మనసు: `ఓజీ` దర్శకుడికి కోటి విలువైన కారు గిఫ్ట్! సుజీత్ ఉద్వేగం!

Published: 16-12-2025, 9:04 AM
పవన్ కళ్యాణ్ గొప్ప మనసు: `ఓజీ` దర్శకుడికి కోటి విలువైన కారు గిఫ్ట్! సుజీత్ ఉద్వేగం!
  • `ఓజీ` సినిమా ఈ ఏడాది తెలుగులో బిగెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి రూ. 300 కోట్లు వసూలు చేసింది.
  • పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్‌కు రూ. కోటి విలువైన ల్యాండ్‌ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు.
  • గిఫ్ట్ అందుకున్న సుజీత్, పవన్ పట్ల తన కృతజ్ఞతను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
  • సుజీత్ పవన్ కళ్యాణ్‌కు చిన్ననాటి అభిమాని, ఈ బహుమతితో ఉద్వేగానికి గురయ్యానని తెలిపారు.

పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో వచ్చిన `ఓజీ` చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సంతోషంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్‌కు ఊహించని, కోటి రూపాయల ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ బహుమతితో సుజీత్ భావోద్వేగానికి గురయ్యారు.

`ఓజీ` సంచలన విజయం: పవన్‌ కళ్యాణ్‌ నెక్స్ట్ లెవెల్ గిఫ్ట్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి చాలా రోజుల తర్వాత అదిరిపోయే హిట్‌ పడింది. ఆయన ఇటీవల `ఓజీ` చిత్రంతో మెప్పించిన విషయం తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ఇమ్రాన్‌ హష్మి విలన్‌గా నటించగా, ప్రకాష్‌ రాజ్‌, అర్జున్‌ దాస్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ మూవీ ఈ ఏడాది బిగెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

పవన్‌ కళ్యాణ్‌ ఇందులో గ్యాంగ్‌ స్టార్‌గా నటించాడు. ముంబాయి గ్యాంగ్‌ స్టర్‌గా ఆయన అదరగొట్టాడు. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఎలివేషన్లు సినిమాని నిలబెట్టాయి. పవన్‌ మార్క్ స్టయిల్‌, స్వాగ్‌, యాక్షన్లు, మరోవైపు థమన్‌ సంగీతం, బిజీఎం సినిమాకి బ్యాక్‌ బోన్‌గా నిలిపాయి. మూవీని అభిమానులకు పూనకాలు తెప్పించాయి. దీంతో చాలా కాలంగా హిట్‌ కోసం చూస్తున్న అభిమానులకు ఫుల్‌ మీల్స్ పెట్టినట్టయ్యింది. వాళ్లు బ్రహ్మరథం పట్టారు. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఏకంగా మూడు వందల కోట్లు సాధించింది.

సుజీత్‌కు పవన్ కోటి రూపాయల కారు బహుమతి

ఈ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లని రాబట్టిన సినిమాగా `ఓజీ` నిలవడం విశేషం. అయితే చిత్ర దర్శకుడు సుజీత్‌ తనకు ఇలాంటి లైఫ్‌ టైమ్‌ హిట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ని ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేశాడు పవన్‌ కళ్యాణ్‌. సుజీత్‌కి కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. లాండ్‌ రోవర్‌ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ల్యాండ్‌ రోవర్‌ కంపెనీకి చెందిన డిఫెండర్‌ అనే మోడల్‌ కారుని బాహుమతిగా ఇవ్వడం విశేషం. బ్లాక్‌ కలర్‌ కార్‌ చాలా స్టయిలీష్‌ గా ఉంది. దీని విలువ ఏకంగా రూ.కోటి వరకు ఉంటుంది.

పవన్‌ కళ్యాణ్‌ తనకు కార్‌ గిఫ్ట్ గా ఇచ్చిన నేపథ్యంలో దర్శకుడు సుజీత్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయా ఫోటోలను పంచుకుంటూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు. `అత్యుత్తమ బహుమతి మాటల్లో చెప్పలేనంతగా ఆనందంతో ఒప్పొంగిన  కృతజ్ఞతతో నిండినది. నా ప్రియమైన ఓజీ, కళ్యాణ్‌ గారి నుంచి వచ్చిన ప్రేమ, ప్రోత్సాహమే నాకు అన్నీ. చిన్ననాటి అభిమానిగా ఉండటం నుంచి ప్రత్యేక క్షణం వరకు ఎప్పటికీ రుణపడి ఉంటాను` అని తెలిపారు సుజీత్‌.

పవన్ కళ్యాణ్ అభిమానిగా సుజీత్ భావోద్వేగ ట్వీట్

పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాది `హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అలరించారు. `ఓజీ`తో కెరీర్‌ బెస్ట్ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు ఆయన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. ఇటీవల `దేఖ్‌ లేంగే సాలా` పాటని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.

`ఓజీ` బ్లాక్‌బస్టర్‌తో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఓ మైలురాయిని అందుకున్నారు. దర్శకుడికి ఆయన ఇచ్చిన ఈ అద్భుతమైన బహుమతి, చిత్ర పరిశ్రమలో వారి అనుబంధాన్ని, గొప్ప మనసును చాటి చెబుతోంది. సుజీత్ ఆనందం అభిమానులను కూడా సంతోషపరిచింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.