|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాయల్ రాజ్ పుత్ సంచలనం: 12 ఏళ్ల కష్టం వృథా కానివ్వను! ట్రోల్స్ కు దిమ్మతిరిగే రిప్లై!

Published: 04-02-2026, 12:35 AM
పాయల్ రాజ్ పుత్ సంచలనం: 12 ఏళ్ల కష్టం వృథా కానివ్వను! ట్రోల్స్ కు దిమ్మతిరిగే రిప్లై!
  • పాయల్ రాజ్ పుత్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
  • ఆమె తన కెరీర్‌ను టెలివిజన్ సీరియల్స్‌తో ప్రారంభించి, తరువాత హీరోయిన్‌గా ఎదిగారు.
  • తన కెరీర్ ముగిసిందనే పుకార్లపై పాయల్ సోషల్ మీడియాలో స్పందించారు.
  • గత 12 ఏళ్ల కష్టాన్ని వదులుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు.

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ తన కెరీర్‌పై వస్తున్న పుకార్లకు గట్టిగా బదులిచ్చింది. 12 ఏళ్ల కష్టాన్ని వదులుకునేది లేదని ఆమె స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

టెలివిజన్ నుండి వెండితెర వరకు పాయల్ ప్రయాణం

Payal Raj Puth:అజయ్ భూపతి (Ajay bhupathi)దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajputh). తొలిసారి తన కెరియర్ను ‘సప్నోన్ సే భరే నైనా’ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా తన కెరీర్ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించింది. బుల్లితెరపై మంచి పేరు దక్కించుకున్న తర్వాతే హీరోయిన్ గా అడుగుపెట్టింది. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆశించిన రేంజ్ లో అవకాశాలు తలుపు తట్టకపోవడంతో ఈమె కెరియర్ ముగిసిపోయిందని, బుట్ట సర్దుకొని ఇండస్ట్రీకి దూరం కావాలని కొంతమంది కావాలని ఈమెపై నెగటివ్ ప్రచారం చేశారు. దీంతో తాజాగా ఈమె స్పందిస్తూ రూమర్స్ కి చెక్ పెట్టింది.

పాయల్ రాజ్ పుత్ ఈ మేరకు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. తన కెరీర్ ముగిసిపోయిందని, నటన మానేయాలని విమర్శిస్తున్న వారికి ఆమె ఘాటుగా సమాధానమిచ్చింది.” నేను నటన మానేయాలని కొందరు కోరుకుంటున్నారు. నేను కూడా ఒక నిమిషం ఆలోచించాను. కానీ గత 12 ఏళ్లుగా నేను పడిన కష్టం నాకు గుర్తొచ్చింది. నేను విఫలం కావచ్చు కానీ సినిమా రంగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ పాయల్ రాసుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కెరీర్ పై వస్తున్న పుకార్లకు పాయల్ రాజ్ పుత్ సమాధానం

ఇక ఈమె నటనా రంగ విషయానికొస్తే.. 2017లో పంజాబీ చిత్రమైన ‘చెన్న మెరయ’ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక హిందీలో ‘ వీరే కి వెడ్డింగ్’ అనే చిత్రంతో హిందీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో సినిమా మొత్తం అందాలతో ఆరబోత చేస్తూ రెచ్చగొట్టిన ఈమె.. చివర్లో విలన్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. పాయల్ నటనకు అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. అంత అద్భుతమైన నటన కనబరిచింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కామెడీ పాత్ర పోషించి, తనలోని నటనను బయటకు తీసింది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాయల్ కామెంట్స్

ఇక ఆ తర్వాత సీత , RDX ఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిధి అంటూ పలు చిత్రాలలో నటించింది. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ లభించలేదు. ఇక చివరిగా మాయాపేటిక , మంగళవారం సినిమాలలో నటించింది. మంగళవారం సినిమాలో తన అద్భుతమైన నటనతో మళ్లీ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం గోల్ మాల్ , దేవదూత, కిరాతక వంటి చిత్రాలలో నటిస్తోంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా ఈమె కెరియర్ అయిపోయింది అని కామెంట్లు చేసిన వారికి ఒక్క పోస్టుతో గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

పాయల్ రాజ్ పుత్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఆమె తన కెరీర్ పట్ల అంకితభావంతో ఉందని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.